38.2 C
Hyderabad
April 29, 2024 19: 48 PM
Slider మెదక్

నేను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు కరెక్టు కాదు

#MBPatil

ఇటీవల తను బీజేపీ లో చేరుతున్నట్లు  సోషల్  మిడియాలో వస్తున్న ప్రచారాన్ని జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ తీవ్రంగా ఖండించారు.  అది పూర్తిగా అవాస్తవంఅని, తనపై వస్తున్న దుష్ప్రచారాలపై చట్టపరమైన  చర్యలు తీసుకుంటాని ఆయన ప్రకటించారు.

పార్లమెంట్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేలలతో తనకి ఎలాంటి విభేదాలు లేవని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆశీస్సులతో పార్లమెంట్ నియోజకవర్గంలో ని ప్రజాబలం తో  అందరి మద్ధతుతో తను రెండవసారి ఎంపీ గా గెలిచినట్లు పాటిల్ తెలిపారు.

నారాయణ ఖేడ్ నియోజకవర్గం లో జొన్నల కేంద్రం ను ప్రారంభించిన ఎంపీ బిబి పాటిల్ అనంతరం మీడియం సమావేశం లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, రైతు సమస్యలు తెలిసిన వ్యక్తి అందు గురించి రైతు బంధు, రైతు బీమా, సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆయన అన్నారు.

రైతు పండించిన పంటను కూడా ప్రభుత్వం మే కొనుగోలు చేస్తుందని, పార్లమెంట్ నియోజకవర్గం లో  రైతులు జొన్నలు పండించిన పంట రావడంతో  వచ్చిన పంటను ఎక్కడ అమ్మలో తెలియక ఇబ్బందులు పడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని తెలిపారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు  పండించిన పంటను  ప్రభుత్వ మే కొనుగులు చేయడం  ఏ రాష్టం లో లేని విధానం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ ఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే  మహారెడ్డి భూపాల్ రెడ్డి    స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related posts

మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు

Satyam NEWS

సూసైడ్ అట్టెంప్ట్: వేములవాడలో జంట ఆత్మహత్య యత్నం

Satyam NEWS

బ్రహ్మంగారిమఠం వద్ద తల్లీ కూతుళ్ల దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment