27.7 C
Hyderabad
April 30, 2024 07: 22 AM
Slider నల్గొండ

ప్రారంభమైన పోలింగ్

#munugodu

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పార్టీ ఏజెంట్ల సమక్షంలో  మాక్ పోలింగ్ చేపట్టి పోలింగ్ ప్రారంభించారు. కొన్నిచోట్ల ఈ వి ఏం లు మొరాయించటంతో వెంటనే వేరే ఈవిఎమ్ ఏర్పాటు చేశారు. సిబ్బందికి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. మొత్తం మునుగోడు నియోజకవర్గం లో ఓటర్ల సంఖ్య 241805.  ఉప ఎన్నికకు 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు.   అర్బన్ పరిధిలో 35 పోలింగ్ బూతులు రూరల్ పరిధిలో 263 బూతులు.  మొత్తం 1192 ఈవీఎంలు, 596 వి వి పాట్లు, 596 కంట్రోల్ యూనిట్ల ఏర్పాటు. ఎన్నికల నిర్వహణకు 373 మంది పిఓలు, 373 మంది ఏపీవోలు, 740 జిపిఓల తో విధులలో వున్నారు. మొత్తం 3366 మంది పోలీసులతో భద్రత చేపట్టగ, అదనంగా 15 కంపెనీల కేంద్రబలగల వినియోగిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 45 ప్రాంతాల్లో 105 పోలింగ్ బూతులు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇక్కడ  రాజకీయపార్టీల నేతలు ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకోవటం గమనార్హం.

Related posts

పైడితల్లి అమ్మ వారి జాతరపై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమీక్ష…!

Satyam NEWS

ప్రజలకు చేరువ అవుతున్న సంచార వైద్య సేవ

Satyam NEWS

శ్రీ వ‌కుళామాత‌ ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం

Satyam NEWS

Leave a Comment