33.2 C
Hyderabad
May 4, 2024 00: 14 AM
Slider మెదక్

పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

#HarishRaoTRS

గజ్వేల్ ఐఓసీ భవన్ లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకుల కిట్స్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నేడు పంపిణీ చేశారు. కరోనా వైరస్ గురించి బ్రాహ్మణులకు అవగాహన కల్పిస్తూ., ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని సూచించారు.

ప్రతి ఒక్కరు మీటరు దూరం డిస్టన్స్ ఉండాలని, మాస్కులు ధరించాలి. ఇంకా కొన్ని రోజులు లాక్ డౌన్ కు సహకరిస్తూ.., ఇలాగే అందరం ఐక్యతతో కరోనా వైరస్ తరిమికొడదాం అని ఆర్ధిక మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తున్నదని, అందుకే నిన్న కేవలం 2 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. ఇందుకు ప్రజల సహకారం, వైద్యులు, పోలీసులు సేవలు అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రామ గ్రామాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగుర వేద్దాం

Satyam NEWS

టీడీపీ అంటే చంద్రబాబు దోచుకున్న పార్టీ

Satyam NEWS

మూడు రోజుల పాటు వానలే వానలు

Satyam NEWS

Leave a Comment