30.2 C
Hyderabad
September 14, 2024 15: 48 PM
Slider ముఖ్యంశాలు

మూడు రోజుల పాటు వానలే వానలు

Rain in Hyderabad

ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 4.5 కి.మి ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్ళేకొద్ది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉన్నది. దక్షిణ ఒరిస్సా, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో 7.6 కి.మి ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా ఈశాన్య బంగాళాఖాతంలో సుమారుగా ఆగస్టు 4 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పులతో తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అదే విధంగా కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాలలో రాగల మూడురోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో కూడా రాగల మూడురోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Related posts

సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టుల ప్రదర్శన

Bhavani

మునిసిపల్ ఎన్నికలలో గెలిచేది మేమే

Satyam NEWS

జై హో స్టాలిన్ : కోవిడ్ ఆస్పత్రులను సందర్శించిన ముఖ్య మంత్రి

Satyam NEWS

Leave a Comment