28.7 C
Hyderabad
May 5, 2024 10: 20 AM
Slider ఆదిలాబాద్

గుడ్ డెసిషన్: పౌల్ట్రీ ఫారం యాజమాన్యాల ఔదార్యం

nirmal police 172

కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం పోలీసు సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. కుటుంబ సభ్యులను వదలి రోడ్లపై అహర్నిశలు విధులు నిర్వహిస్తూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు.

శుక్రవారం సాయుధ దళ, ఎస్పీ క్యాంప్ ఆవరణలో నిర్మల్ గ్రామీణ సిఐ శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సాహంతో కొమ్మ ప్రసాద్ లోలం పౌల్ట్రీ వారి సౌజన్యంతో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి కోడిగుడ్లు గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరాయంగా సేవలందిస్తున్న సిబ్బందికి ఏదో ఒక రూపంలో దాతలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అని అన్నారు.

పౌష్టిక ఆహారం తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ  అధికంగా అవుతుందని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, నిర్మల్ పట్టణ/గ్రామీణ సిఐలు జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐలు వెంకటి, కృష్ణ ఆంజనేయులు, ఆర్ఎస్ఐలు, ఎస్బీ సిబ్బంది, సాయుధ దళ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరోనా వ్యాక్సిన్ తయారు అవుతున్నదా? నిజమేనా?

Satyam NEWS

రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి

Satyam NEWS

గ‌డీల పాల‌న బ‌ద్ద‌లు కొట్టాలంటూ ఇందిరా పార్క్ వ‌ద్ద పెద్ద ఎత్తున ధ‌ర్నా

Satyam NEWS

Leave a Comment