30.7 C
Hyderabad
May 5, 2024 06: 10 AM
Slider వరంగల్

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

#prajavani

ప్రజావాణి లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే  పరిష్కారం చూపాలని ములుగు  జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి  కార్యక్రమంలో  37 దరఖాస్తులు రాగా వాటిలో  ధరణి భూ సమస్యలు వృద్ధప్య పింఛన్లు స్వయం ఉపాధి వంటి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ వై వి గణేష్  స్వీకరించారు. ప్రజల నుండి  అందిన  దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు ఎండార్స్ చేసి సిఫారసు చేశారు. 

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను  ప్రాధాన్యత ఇస్తూ వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో  ఉన్న సమస్యలు  పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ అధికారులకు  సూచించారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పి సిఇఓ ప్రసూన్నరాణి,  సిపిఓ ప్రకాష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల రవి,డి.ఎస్.ఓ అరవింద్ కుమార్ రెడ్డి,  జిల్లా మేనేజర్ శ్రీరాములు, బీసీ వెల్ఫేర్ అధికారి,  లక్ష్మణ్ ఎస్సీ వెల్ఫేర్ అధికారి భాగ్యలక్ష్మి,  జిల్లా సంక్షేమ అధికారి ఈపి ప్రేమలత, జిల్లా ఉపాధి కల్పన అధికారి కుమారస్వామి ఎస్బిఐ బ్యాంక్ ఎల్ డి ఎం ఆర్ రాజ్ కుమార్ పరిశ్రమల అధికారి శ్రీనివాస్ కలెక్టరేట్ సిబ్బంది సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Rename: మరో పథకానికి మా నాన్న పేరు

Satyam NEWS

షేమ్: పసుపు చుట్టూ అరాచక రాజకీయం

Satyam NEWS

కామారెడ్డిలో అభివృద్ధి పనులకీ 40 కోట్లు మంజూరు

Satyam NEWS

Leave a Comment