29.7 C
Hyderabad
May 3, 2024 03: 31 AM
Slider ప్రకాశం

చోరికి పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు

#mallikagargips

రాష్ట్రవ్యాప్తంగా పదిహేడు కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దర్ని ప్రకాశం జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ మాలికా గార్గ్ అభినందించారు. చోరీ సొత్తు విలువ సుమారు ముప్పై లక్షల డెబ్బై రెండువేల రూపాయల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు.

వినుకొండ మండలం పల్నాడు జిల్లా పెద్ద కంచర్ల గ్రామానికి చెందిన గుడిపాటి వీరాంజి చాలా కాలంనుండి దొంగతనాలు చేసేందుకు అలవాటుపడ్డాడు. ప్రకాశం జిల్లాతో పాటు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో గుడిపాటి వీరంజి ఇంట్లో చోరీలు వీరే చేసినట్లు నిర్ధారణ అయింది.

పగటి పూట తిరిగి ఎక్కువుగా ఇంటి యజమానులు ఇంటికి తాళం వేసి, తాళాలని పక్కనే గుట్లలో గాని ప్రక్క పెట్టడం గాని, బీరువా తాళలను బీరువాల పైన దిండుల క్రింద పెట్టడం గమనించి దొంగతనాలుకు వీరు పాల్పడేవారు. దొంగలించిన బంగారు వస్తువులను మరొక వ్యక్తి అయిన గోపు శ్రీనివాసరావుకు ఇచ్చి వాటిని అమ్మమని చెప్పేవారు.

ప్రకాశం జిల్లా ఎస్పీ మాలికా గార్గ్ ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి ఆధ్వర్యంలో త్రిపురాంతకం సీఐ ఎం రాంబాబు, కురిచేడు ఎస్సై శివ నాగరాజులు కలసి ముమ్మర దర్యాప్తు చేసి నిందితులను వెంగాయపాలెం గ్రామ చెక్ పోస్ట్ కురిచేడు మండలం వద్ద అరెస్టు చేశారు. వీరి వద్దనుండి 640 గ్రాముల బంగారు నగలు, ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

Related posts

కురుపాం పాము ఘటన: ప్రాణాపాయ స్థితి నుంచీ కన్నవారి చెంతకు

Satyam NEWS

కాచిగూడ డివిజన్ లో మంచినీటి సమస్య వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

24 న సూర్యాపేటకు కేసీఆర్

Bhavani

Leave a Comment