31.7 C
Hyderabad
May 2, 2024 08: 04 AM
Slider ముఖ్యంశాలు

కురుపాం పాము ఘటన: ప్రాణాపాయ స్థితి నుంచీ కన్నవారి చెంతకు

#snakebite

సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డ చిన్నారులు

డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కురుపాం నియోజకవర్గపు ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి..ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోనున్నారు. ఎందుచేతనంటే ఈ నెల 3 న కురుపాం బీసీ గురుకుల సంక్షేమ పాఠశాల లో పాము కాటుకు ఒక విద్యార్థి మృతి చెందగా మిగిలిన ఇద్దరు విద్యార్థులు.. విజయనగరం తిరుమల హాస్పిటల్ లో చికిత్స పొంది ఎట్టకేలకు సురక్షితంగా కోరుకున్నారు.

ఈ మేరకు  ఇద్ద‌రు బాలుర‌ను స్థానిక తిరుమ‌ల ఆసుప‌త్రి నుంచి  డిస్‌ఛార్జి చేశారు. త‌మ పిల్ల‌ల ప్రాణాల‌ను నిల‌బెట్టిన ఆసుప‌త్రి వైద్యుల‌కు, ప్ర‌భుత్వానికి,  వారి కన్నవారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈనెల 3వ తేదీన కురుపాంలోని మ‌హాత్మా జ్యోతిభా ఫూలే గురుకుల పాఠ‌శాల‌లో ముగ్గురు చిన్నారుల‌కు పాము కాటు వేసింది.

జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు ఈ ముగ్గురినీ ఈ నెల 4వ తేదీ ఉద‌యం హుటాహుటిన జిల్లా కేంద్రంలోని తిరుమ‌ల ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఒక విద్యార్థి మార్గ‌మ‌ద్యంలోనే మృతి చెంద‌గా, ప్రాణాపాయ‌ స్థితిలో ఉన్న ఈదుబిల్లి వంశీ, వంగ‌పండు న‌వీన్‌ల‌ను ఆసుప‌త్రిలో చేర్చి, అత్యున్న‌త స్థాయి చికిత్స‌ను అందించడంతో, ఇద్ద‌రూ కోలుకున్నారు.

ఈ ఇద్ద‌రు బాలుర‌ను కోలుకుని కన్నవారికి అప్పజెప్ప న  సంద‌ర్భంగా ఆసుప‌త్రి ఎండి డాక్ట‌ర్ తిరుమ‌ల ప్ర‌సాద్‌, చికిత్స నందించిన ఐసీయూ ఇన్‌ఛార్జ్ డాక్ట‌ర్ రామారావు మీడియాతో మాట్లాడారు. ఇద్ద‌రు చిన్నారులు అత్యంత అపాయ‌క‌ర స్థితిలో ఆసుప‌త్రిలో చేర్చార‌ని చెప్పారు.

పాము విష‌యం కార‌ణంగా, వారి న‌రాల వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ద‌ని చెప్పారు. అత్యంత విష‌పూర‌తిమైన కింగ్ కోబ్రా విషానికి విరుగుడు నిస్తూ, చాలా జాగ్ర‌త్త‌ల‌తో, క్లిష్ట‌మైన ప‌రిస్థితిలో ఉన్న ఇద్ద‌రికీ చికిత్స‌ను అందించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.  ఈ పాముకాటు కార‌ణంగా భ‌విష్య‌త్తులో కూడా వారికి ఎటువంటి ఇబ్బందులూ త‌లెత్త‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

చిన్నారులు ఇద్ద‌రికీ చికిత్సనందించ‌డంలో ప్ర‌భుత్వం, జిల్లా యంత్రాంగం నుంచి, డిప్యూటీ సీఎం పుష్ప‌శ్రీ‌వాణితోపాటు ఇత‌ర మంత్రుల‌నుంచి, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు నుంచి సంపూర్ణ స‌హ‌కారం ల‌భించింద‌ని తెలిపారు. అనంత‌రం ఇద్ద‌రు బాలుర‌కు డిస్‌ఛార్జి ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆసుప‌త్రి సూప‌రింటిండెంట్ డాక్ట‌ర్ మ‌హేష్‌, డాక్ట‌ర్ జ‌గ‌దీష్‌, చిన్నారుల తండ్రులు నాగ‌రాజు, వెంక‌ట‌ర‌మ‌ణ పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎలర్ట్: గచ్చిబౌలి లో మరో క్వారంటైన్ సెంటర్

Satyam NEWS

తెలంగాణ ఉద్యమంతో బతుకమ్మకు గుర్తింపు

Satyam NEWS

మాతా నీకివే…

Satyam NEWS

Leave a Comment