39.2 C
Hyderabad
May 4, 2024 20: 49 PM
Slider విశాఖపట్నం

కేంద్ర మాజీ మంత్రి ని తూర్పారబెట్టిన మంత్రి బొత్స

#ministerbotsa

ఈ నెల 12 వ తేదీన ప్రధాని మోడీ తెలుగు రాష్ఠ్రాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట విశాఖ కు ఆ తర్వాత రామగుండం కు వెళ్లనున్నారు… ప్రధాని మోడీ. అయితే విశాఖ లో దాదాపు 12వేల కోట్ల తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్నారు… పీఎం మోడీ. అందుకు తగ్గట్లుగా నే జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది కూడా. అదే రోజు ఉత్తరాంధ్ర నుంచీ భారీ ఎత్తు న జన సమీకరణ చేయాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆదేశించింది.

అందుకు తగ్గట్టుగా నే వైఎస్సార్సీపీ చర్యలు చేపట్టింది.విజయనగరం జిల్లా లో ఐదు నియోజకవర్గాల నుంచే జన సమీకరణ చెయ్యాలని అందుకు వైఎస్సార్సీపీ విజయనగరం నియోజకవర్గ సమావేశం… నగరంలో ని రింగ్ రోడ్ లో ఉన్న  ఓ ప్రైవేట్ హోటల్ లో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు అధ్యక్షత… డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఆధ్వర్యంలో మంత్రి బొత్స, జేడ్పీ చైర్మన్ చిన్న శీను….తదితరులు నేతలంతా హాజరయ్యారు. ఆ సభను ఉద్దేశించి మంత్రి బొత్స మాట్లాడుతూ… కేంద్ర మాజీ మంత్రి టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేసి మాట్లాడారు. వయస్సు మీద పడ్డ మీరు మూలనుండక… ఎందుకు రోడ్ల మీదకు వస్తారంటూ ఎద్దేవా చేశారు.

ఇటీవల విజయనగరం లో కేంద్ర వైద్య శాల బోర్డు మార్పు విషయంలో.. అలాగే అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నా లో అశోక్ గజపతిరాజు పాల్గొడనాన్ని ప్రస్తావించిన మంత్రి బొత్స.. గడచిన మూడేళ్ళ లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి లో ఇంకెక్కడైనా..లోపం ఉందేమోనని చూసేందుకు వీలు లేకుండా జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని మంత్రి బొత్స స్పష్టం చేసారు.

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల, జేడ్పీ చైర్మన్ చిన్న శీను ఆధ్వర్యంలో విజయనగరం దినిదినాభివృధ్ధి చెందినా…టీడీపీ నేతలకు మరీ ముఖ్యంగా అశోక్ గజపతిరాజు కు సమస్యలు కనిపిస్తున్పాయంటే..ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్న మంత్రి బొత్స… తాను మాట్లాడిన ముప్పావుగంట ప్రసంగం లో మొత్తం అశోక్ నే లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం విశేషం. సమావేశంలో అంతకు ముందు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సభకు హాజరయ్యేందుకు బస్సులు. ఏర్పాటు చేస్తున్నామన్నారు. జగన్ పాలనలో చేసిన అభివృద్ధి ఏంటో..అలాగే విజయనగరం సత్తా ఏంటో చూపించాలని గట్టిగా.. మాట్లాడారు… డిప్యూటీ స్పీకర్ కోలగట్ల.

Related posts

పోలీసుల బెదిరింపు: వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

కరోనా ఎలా విస్తరిస్తుందో సిరిసిల్లా చూస్తే తెలిసిపోతుంది

Satyam NEWS

వైసీపీ నేతలకు మాత్రమే ఇసుక దొరుకుతుంది

Satyam NEWS

Leave a Comment