39.2 C
Hyderabad
May 4, 2024 20: 29 PM
Slider కరీంనగర్

కరోనా ఎలా విస్తరిస్తుందో సిరిసిల్లా చూస్తే తెలిసిపోతుంది

#SircillaTown

కరోనా ఎందుకు విస్తరిస్తున్నది? ఎలా విస్తరిస్తున్నది? అదుపు లేకుండా కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కేంద్రంలో జరిగిన ఒక్క సంఘటన చూస్తూ అర్ధం అయిపోతుంది.

రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే ఈ నియోజకవర్గంలో కరోనా అదుపులేకుండా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సిరిసిల్ల పట్టణంలో సుమారు 750 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కరోనా పాజిటివ్ కేసులను అధికారులు కూడా పట్టించుకోవడం మానేశారు.

అసలు కరోనా అనే ఒక వ్యాధి ఉన్నట్లు కూడా వారు గమనించుకోవడం లేదు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సిరిసిల్ల పట్టణంలో అన్ని వార్డులకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఒకే చోట పంపిణీ చేస్తున్నారు.

మొత్తం 300 చెక్కులు..సుమారు 600 నుండి 800 వరకు మంది హాజరు. అంతా కలిసి ఒకే చోట. ఇలా గుమికూడి ఉండటం కోవిడ్ నిబంధనలకు విరుద్ధం.

ఈ విషయం ముందుగా అధికారులకు తెలిసి ఉండాలి. అయితే మునిసిపల్ అధికారులు ఈ విషయం మర్చిపోయారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ వారికి నిబంధనలు గుర్తు చేస్తే మంచిది.

కళ్యాణ లక్ష్మి చెక్కులను వారి వారి ఇళ్లకు అందచేసినట్లయితే రెండు మూడు రోజులు పట్టినా అందరూ సేఫ్ గా ఉండేవారు. కానీ……

Related posts

వీపనగండ్ల పోలీసులపై ఎస్పీకి పిర్యాదు

Satyam NEWS

మతపరమైన కార్యక్రమాలను నిరోధించే అధికారం ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

రేపు అన్ని స్కూళ్లలో రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment