31.7 C
Hyderabad
May 7, 2024 01: 58 AM
Slider ముఖ్యంశాలు

యూనియన్ పాలిటిక్స్: సబీనా దుకాణానికి చుక్కెదురు

IJU

బల్విందర్ సింగ్ జమ్మూ నేతృత్వంలో కొనసాగుతున్న ఐజేయూ సంఘాన్నే అధికారికంగా గుర్తిస్తున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పిసిఐ) ఛైర్మెన్ జస్టీస్ సి.కె.ప్రసాద్ ఇవ్వాళ ఢిల్లీలో ప్రకటించారు. దీంతో ఐజేయును చీల్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్న సబీనా ఇంద్రజిత్ కు సరైన గుణపాఠం దక్కింది.

వివరాల్లోకి వెళ్తే….సంఘం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఒంటెద్దు పోకడలు అనుసరించిన సబీనా ఇంద్రజిత్ ఇటీవల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) నుండి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. అయితే గతంలో ఇలాంటి వైఖరితోనే బహిష్కరణకు గురై, ఐజేయును చీల్చే ప్రయత్నం చేసి అబాసు పాలయ్యి, కనుమరుగైపోయిన సురేష్ కుమార్ అఖోరీ దారిలోనే… సబీనా అండ్ కో ఐజేయును చీల్చే ప్రయత్నాలు మొదలెట్టింది.

 అయితే ఐజేయు ఆవిర్భావం నుండి నేటి వరకు సంఘాన్ని తమ భుజస్కంధాలపై మోసుకొని ఆయా రాష్ట్రాల్లో వేలాది జర్నలిస్టుల విశ్వాసాన్ని చూరగొన్న వ్యవస్థాపకులు కె.శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఎన్.సిన్హా, దేవులపల్లి అమర్, అమర్ నాథ్, బల్విందర్ సింగ్ జమ్మూ తదితరులు ఐజేయూ తమదేనని మరోసారి నిరూపించుకొని సబీనాకు సరైన బుద్ది చెప్పారు.

పీసీఐలో సభ్యుడిగా కొనసాగుతూ ఇటీవల ఆకస్మిక మృతి చెందిన ప్రభాస్ దాస్(ఒడిశా)స్థానాన్ని భర్తీచేసేందుకు ఇవ్వాళ నామినేషన్ల స్వీకరణ జరిగింది. అయితే ఐజేయు సంఘం తమదేనని, తమ అభ్యర్థికే అవకాశం ఇవ్వాలని సబీనా కొందరితో నామినేషన్ వేయించే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో ఐజేయు బాధ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ లు తమ మిత్ర సంఘం అభ్యర్థి ఆనంద్ రాణా పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ వేయించారు.

వీటిని పరిశీలించిన పీసీఐ ఛైర్మెన్ జస్టీస్ సి.కె.ప్రసాద్, బల్విందర్ సింగ్ నాయకత్వంలో కొనసాగుతున్న ఐజేయూ నే అధికారికంగా గుర్తిస్తూ సబీనా నామినేషన్లను తిరస్కరించడమే కాకుండా ఆనంద్ రాణా నామినేషన్ ను ఓకే చేశారు. దీంతో గత్యంతరం లేక సబీనా అండ్ కో అక్కడి నుండి వెనుతిరగక తప్పలేదు. సబీనాను నమ్ముకున్న పాపానికి కేరళకు చెందిన బషీర్ మాదాల, మణిపూర్ కు చెందిన బిజాయ్ లు బలిపశులయ్యారు.

Related posts

కాలేజీ అమ్మాయిల దుస్తులపై ఆంక్షలు

Satyam NEWS

సంప్రదాయ సిద్ధంగా నమ్మాళ్వారుల సేవా కార్యక్రమాలు

Satyam NEWS

అర్హులయిన లబ్దిదారులందరికీ రుణం

Sub Editor

Leave a Comment