కాలేజీకి వచ్చే అమ్మాయిలు కచ్చితంగా మోకాళ్ల కింద వరకూ ఉండే దుస్తులను మాత్రమే ధరించి రావాలంటూ హైదరాబాద్ లోని, బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆదేశించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం నాడు దుస్తులు సరిగ్గా లేవంటూ, పలువురు అమ్మాయిలను ఆయన ఇంటికి పంపించగా, విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. ప్రిన్సిపాల్ పెట్టిన నిబంధనను తాము వ్యతిరేకిస్తున్నట్టు విద్యార్థినులు వెల్లడించారు. తక్షణమే తన నిర్ణయాన్ని ఆయన వెనక్కు తీసుకోవాలని, లేకుంటే తమ నిరసనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ ఉదయం కళాశాల వద్దకు చేరుకున్న పలువురు ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. దుస్తుల విషయంలో ఆంక్షలను తాము అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నారు.
previous post
next post