Slider ప్రత్యేకం

మోడీ జీ ఒక్క సారి ఈ వార్త చదవుకోండి

horseraiding

రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. సామాన్యుడిపై పెను భారం పడుతున్నది. అయినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కనికరించడం లేదు. ప్రతి రోజూ ఇంకా ఇంకా పెంచుతూనే ఉన్నది. ఆ ధరల ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతున్నది. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను భరించలేక ఒక రైతు బైకును అమ్మి గుర్రాన్ని తెచ్చుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన నరసింహ తన బైక్ విక్రయించి ఒక గుర్రాన్ని తెచ్చుకున్నాడు. దానిపై తన ప్రయాణం కొనసాగిస్తూ నెలకు రూ. 2000 ఆదా చేస్తున్నట్లు నరసింహ తెలిపాడు. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో గుర్రం తెచ్చుకుని దానిపై నిత్యావసర సరుకులు, వ్యవసాయానికి అవసరమైన సామాగ్రి తెచ్చుకొని నెలకు రెండు వేల రూపాయలు మిగిలిస్తున్నట్లు తెలిపాడు. గుర్రానికి కావలసిన దాన వెయ్యి రూపాయలు అవుతుందని నరసింహ వివరించాడు.

Related posts

అక్సిడెంట్:వాహనం ఢీఇద్దరు మహిళలు మృతి

Satyam NEWS

పేదింటి ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు

Satyam NEWS

సైబర్ నేరాన్ని ఛేదించిన ములుగు సైబర్ పోలీసులు

Satyam NEWS

Leave a Comment