26.7 C
Hyderabad
May 3, 2024 08: 29 AM
Slider ప్రత్యేకం

కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే తలెత్తిన జల వివాదం

#cpi party

నాగర్ కర్నూల్ జిల్లాలోని వట్టెం ఏదుల ఏలూరు రిజర్వాయర్ల పనుల పురోగతిని మంగళవారం సిపిఐ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతాంగ సంక్షేమం పేరుతో కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా కృష్ణాజలాలను హక్కుగా సాధించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఉదండాపూర్ రిజర్వాయర్ మినహ 30% నుండి 40 శాతం వరకు పనులు పూర్తయ్యాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన జల వివాదం వల్ల కేంద్ర ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తిని ఆధీనంలోకి తీసుకుందని ,రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆయన విమర్శించారు.పాలమూరు జిల్లా వలస జిల్లా అని జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్నిఆయన డిమాండ్ చేశారు.

ఏపీకి నీళ్లు వెళ్లాలంటే గేట్లు తెరిస్తే చాలు కాగా తెలంగాణకు మోటార్లతో ఎత్తి పోయాలని కృష్ణా జిల్లాలపై తెలంగాణకు 400 టిఎంసి లు రావాలని నీళ్లపై ఏపీ ప్రభుత్వానికి ఉత్సాహం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన ఎద్దేవా చేశారు. కృష్ణా జలాలపై దురాశతో ఏపీ ప్రభుత్వం పలురకాలుగా ప్రయత్నిస్తుందని, మన నీళ్లు మన హక్కులను కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ సాధనలో అందరినీ భాగస్వాములు చేసిన విధంగానే కృష్ణా జలాల సాధనకోసం వర్గాల ఐక్యతతో సాధించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిందని కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే పాలమూరు-రంగారెడ్డి ప్రారంభమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నీళ్లపై ఏపీ ప్రభుత్వానికి ఉన్న ఉత్సాహం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు.రాష్ట్రంలో గల ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయాలని, ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి అందిస్తామని ఆయన పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ నరసింహ, ఉజ్జిని యాదగిరిరావు, ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ జిల్లా కార్యదర్శి పల్లా నరసింహారెడ్డి, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య నాయక్, ఉమ్మడి జిల్లా నాయకులు పరమేష్ గౌడ్, ఆనంద్ జి, ఎస్ఎండి ఫయాజ్, వెంకటయ్య, కేశవులు గౌడ్, దేవేందర్ రెడ్డి, విధేయుడు, కృష్ణయ్య, చంద్రమౌళి, కృష్ణా జి, కొమ్ము భరత్, శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పల్లె నిద్ర చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి

Satyam NEWS

హుజూర్ నగర్ లో పేదల ఇళ్లను కూలిస్తే మీ పతనం తప్పదు

Satyam NEWS

ఈ నెల 31న కేబినెట్ సమావేశం

Bhavani

Leave a Comment