33.2 C
Hyderabad
May 11, 2024 14: 09 PM
Slider గుంటూరు

కుక్కలు బెడద నుండి ప్రజలను కాపాడండి

#Protect people

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మునిసిపాలిటీ పరిధిలో వీధి కుక్కల భారిన పడి ప్రజలు గాయలపాలవుతున్నారని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ కు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం నిర్వర్తించే స్పందన కార్యక్రమంలో ఈమేరకు పిర్యాదు చేసారు.

సాక్షాత్తు పురపాలక సంఘం ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు,అధికార పార్టీ వైస్సార్సీపీ కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి కుక్కల భారిన పది ఇటీవల గాయాలపాలయిన విషయం జేసీ కి వివరించారు. కుక్కలను చంపకుండా పట్టుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి దూరంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టి పట్టణాల్లోకి రాకుండా చూడాలని కోరారు.

ఇళ్లలో కుక్కలకు లైసెన్సులు ఇవ్వాలని కోరారు. ఇళ్ళల్లో కుక్కలు కూడా యజమానులు నిర్లక్ష్యం వల్ల వీధుల్లో ప్రజలను వెంబడించి కరుస్తూ ఇబ్బందులు పెడుతున్నందున లైసెన్సులు అమలు చేయాలని కోరారు. ఈమేరకు జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ చిలకలూరిపేట మునిసిపల్ కమీషనర్ కు ఆదేశాలు ఇస్తామని సమస్య పరిష్కారం కాకుంటే నేరుగా తనను సంప్రదించాలని రావుసుబ్రహ్మణ్యం కు హామీ ఇచ్చారు.

కుక్కలను అదుపులోకి తేవడంలో చిలకలూరిపేట పురపాలక సంఘం అధికారులు మంత్రి విడదల రజని చోద్యం చూస్తున్నారని రావుసుబ్రహ్మణ్యం కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కుక్కల సమస్య అదుపులోకి తేవాలని లేకుంటే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేయకతప్పదని రావుసుబ్రహ్మణ్యం అధికారులకు తెలిపారు.

Related posts

[Free Trial] Diabetes New Medicines Vitamin To Reduce Blood Sugar An Abnormally High Concentration Of Glucose In The Blood

Bhavani

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Bhavani

ఆందోళన వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల ప్రకటన

Sub Editor

Leave a Comment