29.7 C
Hyderabad
April 29, 2024 09: 21 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ పోలీసులపై జర్నలిస్టు రాజశేఖర్ ఫిర్యాదు

#kollapur

స్థానిక ఎమ్మెల్యే అండ చూసుకుని రెచ్చిపోయి అమాయకులను వేధించిన కొల్లాపూర్ ఎస్ ఐ జి.బాల వెంకటరమణ ఇప్పుడు చిక్కుల్లో ఇరుకున్నారు. వందలాది మంది అమాయకులను వేధించిన కొల్లాపూర్ ఎస్ ఐ బాల వెంకట రమణపై సీనియర్ జర్నలిస్టు అవుట రాజశేఖర్ పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. 2021 జూన్ 2న కొల్లాపూర్ ఎస్సై జి.బాల వెంకటరమణ తప్పుడు ఫిర్యాదుపై తనను అరెస్టు చేసినట్లు రాజశేఖర్ తెలిపారు.

తప్పుడు ఫిర్యాదు తీసుకోవడమే కాకుండా తనను పోలీస్ స్టేషన్ కు పిలిచి చిత్రహింసలకు గురి చేశాడని ఆయన పేర్కొన్నారు. తనపై పోలీస్ స్టేషన్ లో పోలీసులతో దాడి చేయించి చంపడానికి కూడా బాల వెంకట రమణ ప్రయత్నించారని రాజశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కులంపేరుతో దూషించి తన ప్రతిష్టకు భంగం కలిగించాడని ఆయన వెల్లడించారు.

తనపై కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు జరిపిన దాడి గురించి మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. మానవహక్కుల సంఘం ఇచ్చిన నోటీసులకు పోలీసు శాఖ ఎలాంటి స్పందన చూపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించానని రాజశేఖర్ వెల్లడించారు. తననే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఎస్ ఐ బాల వెంకట రమణ తీవ్రంగా దూషించాడని ఆయన అన్నారు.

తప్పుడు ఫిర్యాదులు చేసిన వారి నుండి తనకు, తన కుటుంబానికి ఇప్పుడు ప్రాణహాని ఉందని,  రక్షణ కల్పించాలని పిర్యాదులో పేర్కొనడం జరిగింది. జర్నలిస్టుగా తాను ఆధారాలతో సహా వార్తలు రాయడమే ఎస్ ఐకి బాధ కలిగించిందని ఆయన అన్నారు. అప్పటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు.

ఈ అక్రమాలన్నింటికి స్థానిక ఎస్ ఐ కొమ్ముకాశారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. జర్నలిస్టు రాజశేఖర్ ఫిర్యాదుతో ఎలాంటి చర్యలు ఉంటాయోనని తప్పు చేసిన ఆ పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

Related posts

ఫేక్ కాల్: మహిళ కిడ్నాప్ అయింది రండి

Satyam NEWS

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు

Satyam NEWS

నష్టపోయిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు మంజూరుచేయాలి

Bhavani

Leave a Comment