30.7 C
Hyderabad
May 5, 2024 06: 49 AM
Slider నిజామాబాద్

సబ్ రిజిస్ట్రార్ గారూ.. మీ అవినీతి సేవలు చాలు.. ఇక వెళ్లిపోండి

#kamareddy

‘సబ్ రిజిస్ట్రార్ గారూ.. మీ అవినీతి సేవలు ఇక చాలు.. ఇక మీరు వెళ్లిపోండి’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. అధికార బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ముజీబోద్దీన్. ఆయన ఇంతలా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ శ్రీలతపై గత కొద్దిరోజులుగా అవినీతి ఆరోపణలు పుంఖాలు పుంఖాలుగా వస్తున్నాయి. నిన్న కామారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు సమావేశమై సబ్ రిజిస్ట్రార్ అవినీతికి వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు.

గత కొద్దిరోజులుగా పత్రికల్లో సైతం ఆమె అవినీతిపై కథనాలు వస్తున్నాయి. దాంతో నేడు ముజీబోద్దీన్ నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొద్దిరోజులుగా సబ్ రిజిస్ట్రార్ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఒక అధికారిపై ప్రజలు జాయింట్ యాక్షన్ కమిటీ వేయాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటన్నారు.

సబ్ రిజిస్ట్రార్ శ్రీలత అవినీతితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నోసార్లు ఆమెతో మాట్లాడినా మారలేదన్నారు. తన వద్ద పని చేసే వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం 15 వేలు డిమాండ్ చేసరన్నారు. గతంలో డాక్యుమెంటరీ చార్జీలు, టైపింగ్ చార్జీలు మాత్రమే తీసుకునే వారని, ఇప్పుడు వేలు ఇచ్చుకోవాల్సి వస్తుందన్నారు. తన పేరు చెప్పి డాక్యుమెంటరీ రైటర్లు డబ్బులు తీసుకుంటున్నారని, డాక్యుమెంటరీ రైటర్లను అడిగితే టైపింగ్ చార్జీలు కూడా ఆమెకే ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ఆమె ఎక్కడ పని చేసినా 5 లక్షలు వచ్చే వరకు అక్కడినుంచి కదలరని వినిపిస్తుందన్నారు. 317 జీఓ ద్వారా ఆమె ఇక్కడికి వచ్చారని, ఈ జీఓ ద్వారా ఎవరికి మేలు జరిగిందో తెలియదు గాని కామారెడ్డి ప్రజలకు మాత్రం ఈ జీఓ శాపంగా మారిందన్నారు. సబ్ రిజిస్ట్రార్ కు మాత్రం ఈ జీఓ వరంగా మారిందన్నారు. విఎల్టీ లేకపోతే గతంలో 2 వేలు ఇస్తే రిగిస్ట్రేషన్ జరిగేదని, ఇప్పుడు 5 వేలు ఇవ్వాల్సి వస్తుందన్నారు.

డాక్యుమెంటులో చిన్న అక్షరం తప్పుగా టైప్ అయితే వేలకు వేలు ఇవ్వాల్సి వస్తుందన్నారు. గతంలో సబ్ రిజిస్ట్రార్ వైద్యశాఖలో పని చేసేవారని ప్రస్తుతం ఈ శాఖలో ఎల్.డి.సి గా పని చేసి ప్రమోషన్ మీద 317 జీఓ ద్వారా ఇక్కడికి వచ్చారన్నారు. సబ్ రిజిస్ట్రార్ మీద ఎవరైనా డిస్ట్రిక్ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేస్తే ఆయన నవ్వుతున్నారన్నారు. ఈమె ఏది చెప్తే అది డిఆర్ వింటున్నారని తెలిపారు. 8 రోజులలో సబ్ రిజిస్ట్రార్ మీద అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సేకరిస్తామన్నారు.

మొన్నటి వరకు మధ్యాహ్నం వరకు మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండేవారని, ఇంఛార్జీకి అప్పగించి ఆమె వెళ్లిపోయేవారని, ఇటీవల ఆరోపణలు వస్తుండటంతో రెగ్యులర్ గా వస్తున్నారన్నారు. ఈరోజు తాను ఇక్కడికి వస్తున్నానని సమాచారం ఇవ్వడంతో ఈ రోజు రిగిస్ట్రేషన్లు లేవని తెలిపారు. రిజిస్ట్రేషన్లు చేస్తే అవకతవకలు బయట పడతాయని రిజిస్ట్రేషన్లు ఆపివేసారని చెప్పారు.

డాక్యుమెంటరీ రైటర్లు ప్రజలకు సహకరించాలని కోరారు. ఎవరైనా డాక్యుమెంటరీ రైటర్లు డబ్బులు అడిగితే ఎసిబి అధికారిక నంబర్ 1064, ఎసిబి డిఎస్పీ 7702546789 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. మొన్నటి మున్సిపల్ బడ్జెట్ సమావేశాల రోజు పార్టీలకు అతీతంగా 49 మంది కౌన్సిలర్లు విఎల్టీలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసారని, అయినా కలెక్టర్ స్పందించలేదన్నారు. కలెక్టర్ ఇకనైనా స్పందించాలని, సబ్ రిజిస్ట్రార్ అవినీతిని తక్కువ చేసి చూడటం సరికాదన్నారు.

సబ్ రిజిస్ట్రార్ అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు. నేడు, రేపు పెండింగులో ఉన్న డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఎల్లుండి నుంచి 8 రోజుల పాటు డాక్యుమెంట్లు చేయవద్దని, సబ్ రిజిస్ట్రార్ కు డాక్యుమెంట్లు సమర్పించకుండా తమతో నిరసనలో పాల్గొనాలని డాక్యుమెంట్ రైటర్లను కోరారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి మీ అవినీతి ఇక చాలు మేడమ్.. దయచేసి మీరు ఇక్కడినుంచి వెళ్లిపోండి. మీ సేవలు మాకు ఇక చాలు అంటూ రెండు చేతులు జోడించి వేడుకున్నారు.

చేతులు జోడించి సబ్ రిజిస్ట్రార్ ను వెళ్లిపోవాలని వేడుకున్న ముజీబోద్దీన్ మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం

Related posts

ఆటోడ్రైవర్ కూతురికి విమానం నడిపించే అవకాశం

Satyam NEWS

శ్మశానం లో మొక్కలు నాటిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…!

Satyam NEWS

హెరాస్ మెంట్: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

Satyam NEWS

Leave a Comment