33.7 C
Hyderabad
April 30, 2024 00: 35 AM
Slider ముఖ్యంశాలు

ఆటోడ్రైవర్ కూతురికి విమానం నడిపించే అవకాశం

#komatireddyvenkatreddy

నల్గొండ పట్టణం గొల్లగూడా పెద్దబండకి చెందిన బోడ అమృత వర్శిని ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని. ఆమె తండ్రి ఆటో డ్రైవర్, తల్లి టైలర్. వారిద్దరి కొద్దిపాటి సంపాదన కుటుంబ పోషణకు సరిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అమృత వర్శిని తన చదువును కొనసాగిస్తోంది. ఫైలెట్ కావాలనే ధ్యేయం తో కష్టపడి చదివి ఫైలెట్ గా సెలక్ట్ అయ్యింది. ప్రస్తుతం ట్రైనింగ్ దశలో ఉన్న వర్శినికి తన చదువు పూర్తి చేయాలంటే 6 లక్షల రూపాయలు కావాలి. కుటుంబ నేపథ్యంలో డబ్బులు కట్టడం కష్టంగా మారింది. దిక్కుతోచని పరిస్థితి లో వర్శినికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తుకు వచ్చారు.

తన పరిస్థితి తన లక్ష్యాన్ని  వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆయనకు తెలియజేసింది. ఆయన వెంటనే స్పందించి ఆమెను తన ఇంటికి పిలిపించుకుని 2.00 లక్షల రూపాయలు ఇచ్చి చదువుకు అయ్యే పూర్తి ఖర్చు తనే ఇస్తాను అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా నుంచి ఇప్పటి వరకు డాక్టర్లు, ఇంజనీర్లను  మాత్రమే చదివించిన తనకు ఇప్పుడు అమృత వర్షిణి పైలెట్ చదువుకు సహకరించడం సంతోషంగా ఉందని తెలిపారు. అమృత చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియ జేశారు.

అలాగే విద్యార్థిని అమృత వర్షిణి మాట్లాడుతూ తన చదువుకు సహకరిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో మంది ఇతర నేతల చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని, వెంకట్ రెడ్డి ఒక్క వాట్సాప్ మెసేజ్ తో స్పందించి తన చదువుకు అండగా నిలిచారని తెలిపింది.

Related posts

జీజీహెచ్ పారిశుద్ధ్య విభాగం ఉద్యోగికి మొదటి టీకా

Satyam NEWS

త్రిపుల్ రైడింగ్ పై కేసులు: హెల్మెట్ లేకపోతే ఫైన్: విజయనగరం ఎస్పీ ఆదేశాలు

Satyam NEWS

పోలీసు కార్యాలయాల్లో కరోనా రక్షణ చర్యలు

Satyam NEWS

Leave a Comment