35.2 C
Hyderabad
April 27, 2024 14: 36 PM
Slider ప్రత్యేకం

సిబిఐటి కళాశాల లో  జాతీయ సైన్స్ దినోత్సవం

#cvraman

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా, సిబిఐటి కళాశాల లో  భౌతిక శాస్త్ర విభాగం, సర్ CV రామన్ పై సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు  భారతదేశంలో సైన్స్ ఆవిష్కరణల గురించి అధ్యాపకులు వివరించారు. అదే విధంగా సైన్స్ లో క్విజ్ పోటీలు జరిగాయి. ఈ సందర్బంగా విద్యార్థి వ్యవహారాల సలహాదారు పి శ్రీనివాస శర్మ సైన్స్ మరియు ఇంజనీరింగ్ మధ్య సంబంధం గురించి చెప్పారు.

శర్మ మాట్లాడుతూ సైన్స్ అనగా తెలుసుకోవడం, ఇంజనీరింగ్ అనగా చేయడం అని అర్ధం చెప్పారు. సైన్స్ అనేది ప్రకృతి నియమాన్ని అర్థం చేసుకోవడం ద్వారా జ్ఞానం సంశ్లేషణ. అయితే ఇంజనీరింగ్ అనేది ప్రజలకు సేవ చేయడానికి ప్రకృతిని మార్చడానికి జ్ఞానాన్ని ఉపయోగించడం అని వివరించారు. ఇంజనీర్లు ప్రక్రియలు, నిర్మాణాలు మరియు పరికరాలను నిర్మించడానికి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు.

ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఇద్దరికీ సైన్స్, గణితం మరియు సాంకేతిక పరిజ్ఞానం గురించి మంచి జ్ఞానం ఉండాలి. అయితే సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలను రూపొందించడంలో ఇంజనీర్లు ఈ సూత్రాలను ఉపయోగించేందుకు శిక్షణ ఎంతో అవసరం.  సైన్స్ అంటే ఉన్నదానిని అధ్యయనం చేయడం, ఇంజనీరింగ్ అంటే ఎప్పుడూ లేనిదాన్ని సృష్టించడం అని ఆయన చెప్పారు.

ఫిజిక్స్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ బి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ  సర్ సి వి రామన్ భారత దేశం భౌతిక శాస్త్రవేత్తలతో ప్రసిది చెందిన శాస్త్రవేత్త, రామన్ కాంతి వికిరణం గురించి చేసిన పరిశోధన ప్రపంచం మొత్తానికి మన దేశం గురించి తెలిసేలా చేసిందని అన్నారు. కాంతి ఒక దుమ్ము లేని పారదర్శక రసాయన సమ్మేళనం గుండా ప్రవహించినప్పుడు ఆ కాంతి వికిరణం చెందుతుంది. ఇలా జరిగినప్పుడు కాంతి కొంత భాగం వేరే దిశలో ప్రయాణిస్తుంది.

ఇలా వేరే దిశలో ప్రయాణించిన కాంతికి తరంగ ధైర్యం మారుతుంది. ఇలా వికిరణానికి ముందు తరవాత తరంగ ధైర్యాలలో వచ్చే మార్పును రామన్ ఎఫెక్ట్ అని అంటారు. రామన్ చేసిన కృషి కి గాను 1930లో భౌతికశాస్త్రంలో ఆయనకు నోబెల్ బహుమతి కూడా లభించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

హెల్మెట్ ధరిస్తే ఇక నో స్టాప్

Satyam NEWS

మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

Satyam NEWS

ఎమ్మెల్యే క్రాంతిని సన్మానించిన టీయూడబ్ల్యూజే

Satyam NEWS

Leave a Comment