27.7 C
Hyderabad
May 14, 2024 04: 28 AM
Slider మహబూబ్ నగర్

మోడీ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో నిరసన ర్యాలీ

#ministerniranjanreddy

కేసీఆర్ నాయకత్వాన భారత పార్లమెంటులో 36 పార్టీల సమ్మతిని తీసుకున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. దేశంలో అన్నీ పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చాక అనివార్య పరిస్థితులలో అందరికన్నా ఆఖరుకు సమ్మతించింది కాంగ్రెస్, బీజేపీ పార్టీలన్నారు.

అనివార్య పరిస్థితులలో ప్రజల పోరాటానికి తలొగ్గి విధిలేక 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఇవ్వదనుకుని బీజేపీ తర్వాత ఎలాగైనా దాటవేయొచ్చని మేమొస్తే నూరు రోజులలో తెలంగాణ ఇస్తామన్నారని, కానీ తెలంగాణ ప్రజల అదృష్టం, కేసీఆర్ నాయకత్వాన పెరిగిన వత్తిడి, ఆమరణ నిరాహార దీక్ష, వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలు, అన్నీ వెరసి తెలంగాణ సమాజం గిరిగీసి నిలబడడంతో తెలంగాణ ఇవ్వకుంటే రాజకీయ భవిష్యత్ ఉండదని పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించారని చెప్పారు.

అనేక రకాల చర్చోప చర్చలు జరిగాయని,శానసభలో చర్చలు జరిగాయని, చంద్రబాబు, వైఎస్,రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి , రోశయ్యల పాలనలో చర్చలు జరిగాయని తెలిపారు. పార్లమెంటు, అఖిలపక్షాల భేటీలో , జేఏసీలో, శ్రీ కృష్ణ కమిటీ పర్యటనలో చర్చలు జరిగాయని, ఇవన్నీ అయ్యాక పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసయ్యిందన్నారు.ఇన్ని జరిగాక వచ్చిన బిల్లును మోడీ అవమానించి తన అజ్ఞానం బయటపెట్టకున్నారని విమర్శించారు. ఇది దేశానికి మంచిది కాదని, తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయి అద్భుతంగా పురోగమిస్తున్నామని, దేశంలో అనేక రంగాలలో కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ నంబర్ వన్ స్థానానికి ఎగబాకిందన్నారు.

ఇంత అద్భుతంగా పురోగమిస్తుంటే ఒకనాడు బిడ్డను కని తల్లి చనిపోయిందన్నాడు, ఇప్పుడు తలుపులు మూసి లైట్లు ఆర్పి బిల్లు ఆమోదించారు అంటున్నాడని, దమ్ముంటే విభజన చట్టం తప్పు అనుకుంటే చీము, నెత్తురు, రోషం ఉంటే దానికి ప్రత్యామ్నాయం పార్లమెంటులో పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. మోడీది తెలంగాణ అభివృద్ది పట్ల ఒక ఈర్ష, ద్వేషం, ఒక అసూయ,కారణం ఒక్కటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరుగున పరిచి, ఏక వ్యక్తి పరిపాలన కింద ఏకవ్యక్తిగా చలామణి అవుతున్న మోడీ మోనార్క్ లా దేశాన్ని ఏలాలని అనుకుంటున్నాడని చెప్పారు.

మోడీ రాచరికపు ఆలోచనా విధానానికి గండి కొట్టే సాహసం చేస్తున్నదని చెప్పారు. అందుకే తెలంగాణ మీద కసిబూని మాట్లాడుతూ పిచ్చికూతలు కూస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవారు, దానిని మరిచిపోయిన పాలకులు ప్రజల పాదాల ధూళికింద కలిసిపోతారని తెలిపారు.దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన రాష్ట్రాలన్నీ పరిపాలనా సౌలభ్యం కోసమే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక పరిస్థితులలో దేశంలో కలిసిందని చెప్పారు.

బీజేపీ పార్టీకి తెలంగాణ మీద అవగాహన లేదని, బలవంతంగా తెలంగాణను ఆంధ్రతో కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు చేశారని,అప్పటి నుండి తెలంగాణ అనేక రూపాలలో ఉద్యమాలు చేస్తూ బిడ్డలను కోల్పోతూ రక్తతర్పణం చేస్తూ వచ్చిందని గుర్తు చేశారు.

భూగోళంలో ఒక ప్రాంత ప్రజలు స్వీయ అస్తిత్వం కోసం మాది మాగ్గావాలని కోరిన ఏకైక ప్రాంతం తెలంగాణ ప్రాంతం,తెలంగాణ విశిష్టత, ప్రాధాన్యం వేరు,66 ఏళ్ల సుధీర్ఘ పోరాటంలో బీజేపీ, దాని అనుబంధ సంఘాల పాత్ర రవ్వంత లేదని తెలిపారు.

ఎన్నికల కోసం, ఓట్ల కోసం కాకినాడ తీర్మానంతో డ్రామాలు చేసింది బీజేపీ,  ఆ తర్వాత మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణను విస్మరించారన్నారు. రాజ్యసభలో తెలంగాణ పట్ల ప్రధాని మోడీ వ్యాఖ్యలపై నిరసనగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రసంగించారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

విజయనగరం రహదారి భద్రతా నియమాలపై అవగాహన

Satyam NEWS

కచ్చితంగా నచ్చే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ “ఏ చోట నువ్వున్నా”

Satyam NEWS

అమరవీరులకు పోచారం భాస్కర్ రెడ్డి ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment