Slider గుంటూరు

కోటప్పకొండలో ప్రజల్ని ఆకట్టుకున్న అవగాహన స్టాళ్లు

kotappakonda stals

మహాశివరాత్రి నాడు గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రయివేటు సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఎంతో మందిని ఆకర్షిస్తున్నాయి. కోటప్పకొండ కు వచ్చే లక్షలాదిమంది  భక్తులకు అవగాహన కల్పించడం ఈ ప్రదర్శన శాలల ఉద్దేశ్యం. రోడ్డు సేఫ్టీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా అవగహన స్టాల్స్ లో కరపత్రాలు పంచి ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కరపత్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని స్టాల్ సందర్శించిన వారు తమ ఫీడ్బ్యాక్ లో పేర్కొన్నారని ఆ సంస్థ కన్వీనర్ పద్మజ తెలిపారు. కొండ దిగువన ఏర్పాటు చేసిన తమ అవగాహన స్టాల్ ను వేలాది మంది సందర్శించారని ఆమె తెలిపారు. అంతే కాకుండా మరో వైపు ప్రజలకు విద్యుత్ పొదుపు (300ల లోపు యూనిట్లు)ఎలా పాటించాలి? విద్యుత్ భద్రత ఎలా పాటించాలి అనే అంశాలపై సంబంధిత స్టాల్ లో వివరించారు.

ప్రజలు పెద్దఎత్తున తమ స్టాల్ ను సందర్శించారని, వారికి కరపత్రాలు కూడా పంపిణీ చేశామని ఆ యన్. జి ఓ కన్వీనర్ తెలిపారు. ఈ కార్యాక్రమం లో యన్ జి ఓ ప్రతినిధులు  వేంకటేశ్వరరావు సాంబశివరావు బంగారయ్య కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అచ్చెంనాయుడిపై పోలీసు కేసు నమోదు

Satyam NEWS

ఎల్.కోటలో మరో కోవిడ్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావాలి

Satyam NEWS

బీఆర్ఎస్ పార్టీలో చేరిన సీతక్క అనుచరులు

Satyam NEWS

Leave a Comment