37.7 C
Hyderabad
May 4, 2024 12: 58 PM
Slider విజయనగరం

రైల్వే ఉద్యోగి అప్రమత్తతో తప్పిన ఘోర ప్రమాదం…

#vijayanagaram

విజయనగరం ఎమ్మెల్యే కు ఇటీవలే జగన్ ప్రభుత్వం… పిలచి మరీ డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గత నెల 25 జిల్లా వైఎస్సార్సీపీ నేతలు… హెలికాప్టర్ ద్వారా.. పూలు చల్లి..డిప్యూటీ స్పీకర్ కు ఘనమైన స్వాగతం పలికిన సంగతి విదితమే. అదే రోజు నగరం మొత్తం.. భారీ కటౌట్లు.. బెలూన్లు కట్టి స్థానిక ఎమ్మెల్యే పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు.

సీన్ కట్ చేస్తే..నగరంలో ని ఎత్తు బ్రిడ్జి వద్ద డిప్యూటీ స్పీకర్ కట్ అవుట్లతో కట్టిన బెలూన్..ఒకటి భారీ గా వీచిన గాలులతో. సంతకాల వంతెన పక్కనే. ఉన్న రైల్వే లైన్లతో పాటు.. ఆ పక్కనే రైల్వే శాఖ నిర్మించిన సబ్ స్టేషన్ ..ఇన్ని ఉన్న స్థలంలో డిప్యూటీ స్పీకర్ బ్యానర్ తో ఉన్న ఎయిర్ బెలూన్ వాటిపై పడిపోయేందుకు సిధ్దంగా ఉంది. అదే కనుక ఆ ఎయిర్ బెలూన్ కనుక రైల్వే లైన్లపై పడితే.. భారీ పేలుడు.

ఆ పక్కనే రైల్వే విద్యుత్ సబ్ స్టేషన్ బ్లాస్ట్ అవడం.ఆ ధాటికి పక్కనే ఉన్న సంతకార వంతన బ్రేక్ అవ్వడం జరిగితే…భారీ గా ఆస్థి నష్టం వాటిల్లడమే.కానీ… అక్కడే ఆ రైల్వే విద్యుత్ సబ్ స్టేషన్ ఉద్యోగి..క్షణాల్లో కళ్లెదుట కనపడుతున్ళ దృశ్యం చూసి..వెను వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడే ఎత్తు బ్రిడ్జి పై ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హెచ్.సీ చెప్పడంతో ఇద్దరూ ఘటనా స్థలికి చేరుకుని ..ఆ రైల్వే విద్యుత్ వైర్లపై పడబోతున్న డిప్యూటీ స్పీకర్ బ్యానర్ తో ఉన్న ఎయిర్ బెలూన్ ను.వ్యయప్రయాసలకొర్చి..సంతకాల వంతెన వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జి కి కట్టడంతో పెను ముప్పు ను నివారించారు.

తక్షణమే జరిగిన ఘటన. జరగబోయే పెను ముప్పు ను…అటు రైల్వే ప్రొటెక్షన్ అధికారులకు..ఇటు ట్రాఫిక్ డీఎస్పీ కి,..సదరు సిబ్బంది తెలియజేసారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన రెండు శాఖల అధికారులు.. తమ కింద స్థాయి సిబ్బంది చూపిన చొరవ… ముందు చూపునకు.ఆశ్చర్య పోవడమే కాక.. సిబ్బంది చూపిన ముందు చూపు చర్యకు..అభినందనలు తెలిపారు. క్షేత్ర స్థాయిలో.. అటు ట్రాఫిక్ ,ఇటు ఆర్పీఎఫ్ సిబ్బంది చూపిన తెగువ ,ముందు చూపునకు సత్యం న్యూస్. నెట్.. కూడా హేట్సాఫ్ చెబుతోంది.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

జనగామ లో ఘనంగా వైఎస్ జయంతి

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు

Satyam NEWS

ఫర్ గాటెన్ ప్రామిస్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తూచ్

Satyam NEWS

Leave a Comment