వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై దాఖలైన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ద్రవిడ ఉద్యమనేత తందై పెరియార్ పై రజనీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ ద్రవిడర్ విడుదలై కళగం డీవీకే సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానంఈ విషయంలో కింది స్థాయిమేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకొచ్చారంటూ పిటిషనర్ కు అక్షింతలు వేసింది.
ఇది సరికాదని కేసును కొట్టివేసింది. కాగా తమిళ ప్రజల మధ్య అలజడి రేకెత్తించేలా రజనీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేలా పోలీసులను ఆదేశించాలని డీవీకే పిటిషన్ వేసింది.