30.2 C
Hyderabad
April 27, 2025 19: 30 PM
Slider నిజామాబాద్

పంచలింగాల దర్శనాలకు వెళ్లిన శివస్వాములు

siva swamulu

బాన్సువాడ శివదీక్ష సేవా సమితి శివస్వాములు మాఘ అమావాస్య పురస్కరించుకుని మంజీర నది పరివాహక ప్రాంతాల్లో కొలువుదీరిన 5 స్వయంభు లింగాలు (పంచలింగాలు )దర్శనార్థం తరలివెళ్లారు. ముందుగా నసురుల్లాబాద్ మండలంలోని సోమలింగేశ్వర ఆలయం, పిట్లం మండలంలోని రామలింగేశ్వరాలయం, జుక్కల్ మండలంలోని కౌలాస్ లో గల పాపేశ్వరంలో అనంతరం మహారాష్ట్ర దేగులూర్ డివిజన్లో ని హోటుల్ గ్రామంలో గల పరమేశ్వర లయం అనంతరం మంజీర నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

ఆ తర్వాత కోటగిరి మండలంలోని బస్వాపూర్ లోగల అడ కస్సు  లింగమయ్య  ఆలయంలో దర్శనం ముగించుకుని తిరిగి సోమ లింగాల క్షేత్రానికి చేరుకుని ఈ యాత్రను  ముగించనున్నట్లు గురుస్వామి సుభాష్ గురు  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సంగమేశ్వర్ గురుస్వామి, లాలుస్వామి, రాజశేఖర్ స్వామి, గంగారం  స్వామి, సాయిబాబా స్వామి, శ్రీనివాసస్వామి, సుధీర్ స్వామి, కాశీరాం స్వామి, దయానంద స్వామి, హనుమాన్లు స్వామి, సతీష్ స్వామి ఈ యాత్రలో  పాల్గొన్నారు.

Related posts

పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ కలయిక

Satyam NEWS

ఉప్పల్లో బి ఆర్ ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం

Satyam NEWS

ప్రతిష్టాత్మకంగా వడ్డెర ఆత్మగౌరవ భవన నిర్మాణం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!