కొన్ని ఙ్ఞాపకాలు మనసుకు నచ్చుతాయి,మరికొన్ని మదిలో నిలిచిపోతాయి అలాంటి డే ఈ జ్ఞాపకం అంటూ తన భార్య జయా బచ్చన్, నాగార్జున, ప్రభు, శివరాజ్‌కుమార్‌తో కలిసి తాను దిగిన ఫోటోని అమితాబచ్చన్ తన ట్విట్టర్‌లో షేర్ చేసాడు. ఇక ఈ ఫోటోను షేర్ చేసిన అమితాబ్ జయకి, నాకు ఇది మరిచిపోలేని క్షణం.
ఇండియన్ లెజెండరీ నటుల వారసులైన అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున,తమిళంలో శివాజీ గణేషన్ కుమారుడు ప్రభు, కన్నడం రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్‌లతో కలిసి ఓ యాడ్‌లో నటించడం ఆనందంగా ఉందని అలాగే వాళ్ళతో ఈ ఫోటో ఙ్ఞాపకం కనులవిందుగా ఉందని అమితాబ్ ట్వీట్ చేసారు