30.7 C
Hyderabad
May 5, 2024 04: 08 AM
Slider ముఖ్యంశాలు

రజకులకు ఎస్సీ హోదా ఇవ్వాలి

#SC status

తెలంగాణ రజక సంఘం(231/2016) ములుగు జిల్లా అధ్యక్షుడిగా గుమ్మడవెల్లి లక్ష్మణ్ ఎన్నికయ్యారు. నేడు ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక సంఘం జిల్లా సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్ కు నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు వడ్డేపల్లి సారంగపాణి అన్నారు.

నూతన అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్డేపల్లి సారంగపాణి మాట్లాడుతూ ఈనెల 31వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశ భేటీలో చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశం పరిశీలించాలని కోరారు.

ఆగస్టు మూడో తేదీ నుంచి జరిగే శాసనసభ సమావేశాలలో ప్రధానంగా చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాలని కోరారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజకుడికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రజక బంధు ప్రకటించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వం కుల వృత్తులకు ఇస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సహాయం రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జిల్లా కలెక్టర్ల ద్వారా అందించాలని కోరారు.

వెట్టి కింద ఇచ్చిన ఇనాం భూములకు వెంటనే పట్టాలని అందించాలని కోరారు. ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించిన గురుకులాలు ప్రభుత్వ కార్యాలయంలో దోభీ పోస్టులను వెంటనే రజకుల ద్వారా నింపాలని కోరారు. హైదరాబాద్ ట్యాంక్ బండి మీద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలని, జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని కోరారు.

రానున్న ఎన్నికలలో మా రజకుల జమాషా ప్రకారం ఐదు అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కుదురుపాక పోశం, జిల్లా ప్రధాన కార్యదర్శి వైనాల సదానందం, రాష్ట్ర అధికార ప్రతినిధి బిక్షపతి హనుమంతు, మహిళా జిల్లా నాయకులు శోభ పోషక్క జిల్లా మండల గ్రామ మహిళా నాయకులు విద్యావంతులు మేధావులు అందరూ పాల్గొన్నారు.

Related posts

నివాళి : రత్న ప్రభాకర్ రెడ్డి ఆశయాలు నెరవేరుస్తాం

Satyam NEWS

అచ్చెన్నాయుడికి తెలుగుదేశం అధ్యక్ష పదవి

Satyam NEWS

గ్రామీణ విలేకరులకు టిజెఎస్ఎస్ అవార్డులు

Satyam NEWS

Leave a Comment