దివంగత నేత గాదెల రత్నప్రభాకర్ రెడ్డికి రుణపడి వుంటామంటూ కొవ్వొత్తులతో చౌటబేట్ల గ్రామ యువకులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సోమవారం రాత్రి కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని చౌటబెట్ల గ్రామంలో వంగ రాజశేఖర్ గౌడ్ పిలుపు మేరకు దివంగత మహానేత, ప్రజలు పిలిస్తే పలికే ఎంపీపీ గాదెల సుధారాణి భర్త రత్న ప్రభాకర్ రెడ్డి అకాల మరణానికి యువకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
జోహార్లు రత్నప్రభాకర్ రెడ్డి అంటూ ఆయన రుణం తీర్చుకుంటామంటూ నినాదాలు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. రత్నప్రభాకర్ రెడ్డి ఆశయాలను నెరవేరుస్తాం అంటూ నినాధాలు చేశారు.
ఈ కార్యక్రమంలో బొల్లి నాగరాజు, కిరణ్ నాయుడు, శేఖర్ గౌడ్, కొల విష్ణు, ఎస్.నాగరాజు, సతీష్ నాయుడు, ఖాదర్ నాయుడు, అశోక్ నాయుడు, మహేష్, జగదీశ్వర్ గౌడ్, రమేష్ గౌడ్, బాలకృష్ణ, పొడేండ్ల రాము యాదవ్, సురేష్ యాదవ్, శివకృష్ణ నాయుడు, అచుత్ నాయుడు, శ్రీరామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.