ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తనయుడు రాంచరణ్ సోమవారం 9.30గంటలకు గన్నవరం విమానాశ్రయంలో సందడి చేశారు. ఆయన విజయవాడలో ఓ సెల్ ఫోన్ షాప్ ను ప్రారంభించేందుకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. రోడ్డు మార్గం గుండా విజయవాడ వెళ్లి అక్కడ షాప్ ప్రారంభించి 11.45 గంటలకు తిరిగి విమానాశ్రయానికి వచ్చి హైదరాబాద్ వెళ్లారు. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం, వీడ్కోలు పలికారు.
previous post