విజయవాడ ఈస్ట్ డివిజన్ పరిధిలో కోడి పందేలకు ఎలాంటి అనుమతి లేదని, ఎవరైనా మీరి కోడి పందేలు వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డి.సి.పి. వి.హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం గన్నవరం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డి.సి.పి మాట్లాడారు.
సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో కోడి పందేలు జరుగుతున్నాయని, కానీ ఈ ఏడాది ఎక్కడా కోడిపందేలకు ఎలాంటి అనుమతులు లేవని, కనుక ఎవరైనా కోడిపందేలకు బరిలు ఏర్పాటు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మరోసారి హెచ్చరించారు.
కోడిపందేలు బరిలు ఏర్పాటు చేసే వారు కత్తులు కట్టేవారిపై బైండవర్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఈస్ట్ డివిజన్ లో 71కేసులు నమోదు చేసి ,117మందిపై బైండవర్ కేసులు నమోదయ్యాయి. ఇలాగే మరో వారం రోజుల్లో అలాంటి కార్యక్రమాలు చేసేవారిని ఓ కంట కనిపెడుతున్నామని చెప్పారు.
పేకాట ఆడుతున్న38మందిని అదుపులోకి తీసుకుని 40,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు హర్షవర్ధన్ రాజు చెప్పారు. పేకాట, కోడిపందేలు వేయవద్దని, అలాకాదని ఆటలకు పాల్పడితే కేసులు తప్పవని, ప్రజలందరూ సహకరించాలని కోరారు.