23.2 C
Hyderabad
May 7, 2024 22: 05 PM
Slider నల్గొండ

హైదరాబాద్ ఐటిఐఆర్ కు నిధులు కేటాయించండి

komatireddy

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన (ITIR) హబ్ కు నిధులను కేటాయించాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు వినతి పత్రం అందచేశారు. భువనగిరి లోని ఎమ్స్ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజి ల శాశ్వత భవనాల కోసం వెయ్యి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను కేటాయించాలని కోరారు.

జాతీయ చేనేత అబివృద్ది కార్యక్రమంలో భాగంగా (NHDP) బ్లాక్ లెవల్ క్లస్టర్ లను భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసేందుకు 1013 కోట్ల రూపాయలను విడుదల చెయ్యాలని కూడా కోరారు. హైదరాబాద్ నుండి వరంగల్ వరకు గల జాతీయ రహదారి(NH163) అభివృద్ధి పనుల కోసం ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వాలని ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరారు.

చేనేత కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య భీమా పథకంను ఏర్పాటు చెయ్యాలని, ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకాల క్రింద చేనేత కార్మికులకు 18 ఏళ్ల వయస్సు నుండి 70 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఆరోగ్య భీమా పథకంను వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

Related posts

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

మునుగోడు ఉప ఎన్నిక లో టీఆరెఎస్ విజయం

Murali Krishna

పిడుగురాళ్ల లో 120 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment