26.7 C
Hyderabad
May 3, 2024 09: 56 AM
Slider మెదక్

అత్యాచారం, హత్య కేసు చేధించిన మెదక్ పోలీసులు

మానసిక స్థితి సరిగా లేని ఒక మహిళపై జరిగిన అత్యాచారం, హత్య కేసును మెదక్ పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా ఎస్.పి. పి.రోహిణి ప్రియదర్శిని పెద్ద శంకరంపేట పోలీసు స్టేషన్ పరిది శివాయపల్లి గ్రామ శివారులో జరిగిన ఈ సంఘటన వివరాలను తెలియచేశారు.

21వ తేదీ నాడు ఒక మహిళ సగం పూడ్చబడి ఒక కాలు ఒక చేయి మాత్రం కనిపిస్తూ పూర్తి శరీరం మట్టి తో కప్పబడి చనిపోయిన స్థితిలో ఉన్న ఒక మహిళ శవం కనిపించింది. సమాచారం ప్రకారం అక్కడికి వెళ్ళి పరిశీలించగా ఒక మహిళ సగం పూడ్చబడి ఒక కాలు ఒక చేయి మాత్రం కనిపిస్తూ చనిపోయిన స్థితిలో ఉన్నదని వెంటనే కేసు నమోదు చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. చనిపోయిన మహిళ కుక్కల లక్ష్మి (39) గా నిర్దారణకు వచ్చారు.

ఆ మహిళకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మానసిక స్థితి సరిగా లేక ఊరిలో అక్కడక్కడ తిరుగుతూ ఎవరన్నా ఏదైనా ఇస్తే తింటూ ఉంటుండేది. ఈ సంఘటన ఎలా జరిగింది అని పోలీసులు అన్నీ కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ కేసును ఛేదించడానికి మెదక్ డి.ఎస్.పి ఆద్వర్యలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. చుట్టు పక్కల ప్రాంతాల వ్యక్తులను అక్కడి రైస్ మిల్లులో పని చేసే వారిని విచారించడం జరిగిందని ఒక్కొక్కరినీ విచారించడం వల్ల అందులో ఇద్దరిపై అనుమానం కలిగిందని ఆమె చెప్పారు.

వారిని విచారించగా ఆ నేరాన్ని తామే చేసినామని ఒప్పుకున్నారని ఎస్పీ వెల్లడించారు. వారి వివరాలు ఇవి: బీహార్ కు చెందిన చెడి ముఖియా, సంజిత్ రిషిదేవ్. వారు ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం 16 న సుమారు 20.00 గంటలకు శివయ్యపల్లి గ్రామానికి వెళ్లి, అక్కడ ఇద్దరూ కల్లు సేవించి,దారిలో మల్లికార్జున రైస్‌మిల్లు ఎదురుగా ఉన్న షీక్‌ ఖాసిం టీ స్టాల్‌ దగ్గర ఉన్న గుడిసెలో ఈ మహిళ కూర్చోవడం గమనించారు.

మళ్ళీ నిందితులిద్దరూ అక్కడ షీక్ ఖాసిం టీ స్టాల్‌లో మద్యం తీసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ మహిళ వద్దకు వెళ్లారు. గుడిసెలోకి వెళ్లి మృతురాలి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. అయితే మృతురాలు ప్రతిఘటించి బయటకు శివయ్యపల్లి గ్రామం వైపు వచ్చింది.

నిందితులు ఇద్దరూ మృతురాలిని అనుసరించి, ఆ తర్వాత పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లోకి తీసుకెళ్లి, అక్కడ అత్యాచారం చేశారని ఎస్పీ తెలిపారు. ఆ తర్వాత ఈ విషయాన్ని మృతురాలు ఎవరికైనా చెపుతుందేమో అని నిందితులిద్దరూ ఆ మహిళను హత్య చేసి తర్వాత ఆమె మృతదేహాన్ని సమీపంలోని వ్యవసాయ పొలంలో పాతిపెట్టి అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఈ కేసు జరిగిన వారం రోజుల్లోనే నిందితులను పట్టుకున్నామని ఈ కేసు ఛేదన లో కృషి చేసిన సిబ్బందిని క్యాష్ రివార్డ్ తో అభినందించినామని ఎస్పీ అన్నారు. ఈ కేసు ఛేదన లో కృషి చేసినపోలీసు అధికారులు, సిబ్బంది వివరాలు

  1. కె. సైదులు డీఎస్పీ మెదక్, 2. M. జార్జ్ CIP అల్లాదుర్గ్ సర్కిల్, 3. గోపి ఇన్‌స్పెక్టర్ సిసిఎస్ మెదక్ అండ్ టీమ్, 4. సీఐ మెదక్ రూరల్ సర్కిల్, 5. CI నర్సాపూర్ సర్కిల్, 6. SIP శంకరంపేట-A PS మరియు బృందం, 7. SIP టేక్మాల్ మరియు బృందం, 8. SIP రెగోడ్ మరియు బృందం. 9. జిల్లా సి‌సి‌ఎస్ టీమ్

Related posts

జూనియర్ న్యాయవాదులకు రూ.5000 సహాయం

Satyam NEWS

హైదరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు సర్వం సిద్ధం

Satyam NEWS

ఏపీలో ఒకే సారి 14 మంది కలెక్టర్ల బదిలీ…

Satyam NEWS

Leave a Comment