40.2 C
Hyderabad
May 2, 2024 16: 19 PM
Slider నెల్లూరు

నెల్లూరు రూరల్ లో శరవేగంగా అభివృద్ధి పనులు

#Nellore Rural

నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 19వ డివిజన్ లోని గోమతి నగర్ లో పచ్చ రవి, శివారెడ్డి ల ఆధ్వర్యంలో రెండు డ్రైన్లు, ఒక రోడ్డుకు గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆదాల మాట్లాడుతూ 19వ డివిజన్లోని గోమతి నగర్ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతమని, అయినా కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయని తెలిపారు. 50 లక్షల రూపాయలతో రెండు డ్రైన్లు, పది లక్షలతో ఒక రోడ్డుకు శంకుస్థాపన చేశామని, వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తవుతాయని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో మూడు కోట్ల 25 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేశామని, మరో కోటి 20 లక్షల రూపాయలు మంజూరు చేసామని తెలిపారు.

ఇంకా అవసరమైతే 20 నుంచి 30 లక్షల రూపాయలు మేరకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధి పనులను కూడా చేస్తోందని చెప్పారు. భివృద్ధికి ఆకర్షితులైన పలువురు ముందుకు వచ్చి పార్టీలో చేరుతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

వారికి అండగా ఉంటామని చెప్పారు. సీఎం జగన్ హయాంలో నాడు -నేడు కింద పాఠశాలలు కార్పొరేట్ స్థాయిని సంతరించుకున్నాయని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడమే కాకుండా దుస్తులు, ఆహారం తదితర సౌకర్యాలని కల్పించడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఈ స్కూళ్లలో చేరుతున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్యపరంగా కూడా నగరంలో 4 ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పలు ఆసుపత్రులను ఏర్పాటు చేసి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నారని చెప్పారు.

అని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నందున గడపగడప కార్యక్రమంలో స్థానికుల్లో సంతృప్తి కనిపిస్తోందని, దీంతో మళ్ళీ అధికారంలోకి వస్తామనే నమ్మకం రాజకీయ నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ కనిపిస్తోందన్నారు. చంద్రబాబు పాదయాత్రల పేరిట ఎంత తిరిగినా ఎవరు నమ్మరని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్

రంగారెడ్డి, కార్పొరేటర్లు మూలే విజయభాస్కర్ రెడ్డి, అశోక్ కుమార్, సుధాకర్ రావు, నూనె మల్లికార్జున యాదవ్, అవినాష్, వైసీపీ నేతలు పచ్చారవి, శివారెడ్డి, స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, హరిబాబు యాదవ్, యేసునాయుడు, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సురేష్ రెడ్డి, హరిశ్చంద్ర రెడ్డి, నిజాముద్దీన్, వంశీ, పాశం శ్రీనివాసులు, మైపాడు అల్లా బక్ష్, పిండి సురేష్, నరసింహారావు, సురేష్ బాబు, మధు, శ్రీకాంత్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీస్ శాఖనూ వ‌ద‌ల‌ని కరోనా…తాజాగా మ‌రో సిబ్బంది మృతి….!

Satyam NEWS

ఉత్తర కొరియా అధినేత కిమ్ జీవించే ఉన్నాడా?

Satyam NEWS

ఆదరణ పనిముట్లు… అమ్ముకున్నారు… వదిలేశారు..

Satyam NEWS

Leave a Comment