40.2 C
Hyderabad
May 2, 2024 18: 12 PM
Slider నిజామాబాద్

కరోనా ఎఫెక్ట్: నేటి నుండి రేషన్ బియ్యం పంపిణీ

corona rice

బిచ్కుంద మండలంలో నేటి నుండి రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తహసీల్దార్ వెంకట్రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి పన్నెండు కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు.

నేటి నుండి రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడు తమ వివరాలతో రేషన్ డీలర్లకు వద్దకు వెళ్లి రేషన్ బియ్యం తీసుకోవాలన్నారు. బియ్యానికి ఎటువంటి పైకము చెల్లించనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని ఆయా గ్రామాలలో సర్పంచ్ లు, ఎంపిటిసిలు జడ్పిటిసిలు కూడా గ్రామాల్లో దండోర వేసి అందరికీ తెలియజేయాలని ఆయన కోరారు. బియ్యం కోసం వెళ్లిన వారు తమ కుటుంబంలోని యజమాని  అకౌంట్ బ్యాంక్ వివరాలను డీలర్ కు సమర్పించాలన్నారు.

అకౌంట్లలో మాత్రమే ముఖ్యమంత్రి ప్రకటించిన 1500 రూపాయలు జమ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. రేషన్ పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు గ్రామ రెవెన్యూ అధికారి రెవెన్యూ ఇన్స్పెక్టర్  రెవెన్యూ సిబ్బంది  పర్యవేక్షణలో  ఈ పంపిణీ ప్రక్రియ ఉంటుందన్నారు.

కావున ప్రజలు కూడా ఒక్కొక్కరిగా  వెళ్లి సరుకులను తీసుకోని రావాలన్నారు. అందరూ ఒకేసారి గుమిగూడిన కరోనా వ్యాప్తి సులభమవుతుందని కావున ప్రజలు మాస్కులు ధరించి అక్కడికి వెళ్లాలని సూచించారు.

Related posts

కేసు దర్యాప్తు చేయని పోలీసులకు హైకోర్టు అక్షింతలు

Satyam NEWS

లాక్ డౌన్ బందోబస్తు పరిశీలించిన స్టీఫెన్ రవీంద్ర

Satyam NEWS

ఆర్టీసీ విలీనం కుదిరేపని కాదని మరో మారు వెల్లడి

Satyam NEWS

Leave a Comment