28.7 C
Hyderabad
May 6, 2024 07: 05 AM
Slider రంగారెడ్డి

రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం అక్రమం

singireddy

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఎనుముల రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయమని మేడ్చల్ జిల్లా పరిషత్తు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్  సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమ పాలనకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. పోలీసులకు ఉపయోగించి ఉద్యమాలను అణచివేసే విధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రవర్తిస్తున్నదని ఆయన అన్నారు.

కేటీఆర్ ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలో నిర్మించినట్లు ప్రభుత్వం అంగీకరించినట్లయిందని హరివర్దన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు 14 రోజుల రిమాండ్ కు పంపడాన్ని మేడ్చల్ జిల్లా పరిషత్తు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్  సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి ఖండించారు.

Related posts

తిరుమ‌ల‌లో మ‌ళ్లీ క‌నిపించిన చిరుత‌

Bhavani

శిరోముండనం కేసులో ఎస్ ఐపై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

పాతపట్నం మండలంలో నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment