37.2 C
Hyderabad
April 30, 2024 14: 39 PM
Slider సినిమా

సినిమా హీరోగా మారుతున్న నిజ జీవితం హీరో

#heropawankumar

హీరోగా తన పరిచయ  చిత్రంలోనే జరీనా వహాబ్ వంటి సీనియర్ నటీమణితో కలిసి నటించడం ఇప్పటికీ తనకు నమ్మశక్యంగా లేదని ఎగ్జైట్ అవుతున్నాడు డెబ్యూ హీరో పవన్ కుమార్. మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతుడు, ఫిజికల్ ఫిట్నెస్ కోచ్ మరియు మెరైన్ ఇంజినీర్ కూడా అయిన మల్టీ టాలెంటెడ్ పవన్ కుమార్ హీరోగా సుప్రసిద్ధ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ‘గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ’ సారథి దీపక్ బల్దేవ్ ఠాకూర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెలుగు – హిందీ భాషల్లో తెరకెక్కుతున్న “తు బేఖబర్” షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ట్రైలర్ జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ ఇటీవల ఆవిష్కరించారు. ప్రముఖ బాలీవుడ్ నటి జరీనా వహాబ్ ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించారు.

చీఫ్ మెరైన్ ఇంజినీర్ గా సముద్రంలో సాహసాలు చేసే పవన్ కుమార్… ఫిజికల్ ఫిట్నెస్ కోచ్ కూడా కావడం విశేషం. అంతేకాదు మార్షల్ ఆర్ట్స్ లోనూ అందె వేసిన చెయ్యి ఇతనిది. ఢిల్లీలో పుట్టి, వైజాగ్ లో చదివి, హైదరాబాద్ లో స్థిరపడిన ఈ అచ్చ తెలుగు “విజయనగరం కుర్రాడు” హీరో కావడం కోసం చిన్నప్పటి నుంచి కలలు కని… అందుకోసం కఠోరంగా కృషి చేసి, “తు బేఖబర్”తో సువర్ణావకాశం సొంతం చేసుకున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ప్రస్తుతం ఈజిప్టులో ఉన్న ఈ చాకు లాంటి కుర్రాడు… నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు త్వరలో తన ఉద్యోగ పర్వానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నాడు!!

Related posts

చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం ఆలయం మూసివేత

Bhavani

సూర్యాపేట జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్

Bhavani

సరదాగా ఇంతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

Satyam NEWS

Leave a Comment