26.7 C
Hyderabad
May 3, 2024 07: 07 AM
Slider ఖమ్మం

ఖమ్మం కు రెడ్ అలర్ట్

#Red alert

వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిందని, భారీ నుండి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా వుండి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. డిపిఆర్సీ భవనంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ, పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ తో కలిసి కలెక్టర్ వర్ష పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ శాఖ సూచన ప్రకారం జిల్లాలోని సింగరేణి, కామేపల్లి మండలాల్లో 100 మి.మి. పైగా, రఘునాథపాలెం, ఏన్కూరు, ఖమ్మం రూరల్ మండలాల్లో 60 నుండి 100 మి.మి. వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. ఉరుములు, పిడుగులతో ప్రాణ నష్టం జరుగుతున్నట్లు, వీటి నివారణకు దామిని (damini) యాప్ పై డౌన్లోడ్ పై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

దామిని యాప్ తో పిడుగుల గురించి ముందస్తుగా తెలుసుకొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలన్నారు. పిఆర్, ఆర్ అండ్ బి, ఇర్రిగేషన్ ఇంజనీర్లు సంబంధిత తహసిల్దార్లతో టచ్ లో వుండాలన్నారు. ఇర్రిగేషన్ ఏఇ లకు వారి వారి పరిధిలోని చెరువులు, కుంటలు, నీటి వనరులపై పూర్తి అవగాహన వుండాలన్నారు.

వాగులు పొంగిపొర్లి కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమైన చోట రాకపోకలు జరపకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రమాదానికి ఆస్కారం వున్న రహదారిని మూసివేయాలని, రాకపోకలు జరపకుండా భద్రత ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు. ప్రమాదమున్న చెరువుల వద్ద ఇసుక బస్తాలు సిద్దం చేసుకోవాలన్నారు.

వర్షం లో చేపలు పట్టుటకు వెళ్లకుండా చూడాలన్నారు. లోతట్టు ముంపు ప్రదేశాల్లో వర్షపు నీరు ఇండ్లలోకి రాకుండా తగుచర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ప్రధాన కార్యస్తానంలోనే ఉంటూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

Related posts

క‌రోనాను అరిక‌ట్టేందుకు యువ‌తే మేల్కొనాలంటూ డీఐజీ సందేశం…!

Satyam NEWS

దిశ ఫొటోలు వాడుతున్న మీడియాపై పోలీసు చర్యలు

Satyam NEWS

కాకినాడ సంఘటన పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి

Bhavani

Leave a Comment