28.7 C
Hyderabad
May 6, 2024 00: 15 AM
Slider ఖమ్మం

జిల్లా లో రెడ్ అలెర్ట్ ప్రజలు బయటకు రావద్దు… సహకరించాలి

#Red alert

జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారని , 7 లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు మూత పడ్డాయని,మరో 15 మార్గాల్లో చప్టాలు నీట మునుగుతాయని ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ ప్రియాంక, జిల్లా ఎస్పీ వినీత్ జి భద్రాచలం లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో కోరారు..

2వేల చెరువుల్లో 1035 ఇప్పటికే నిండాయని, రెండు రోజుల్లో మరో 500 చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి . వర్షం, గోదావరి వరద వల్ల కొన్ని గ్రామాల్లోకి నీరు చేరుతుంది. ఆయా గ్రామాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. 23 మండలాల్లో అత్యవసరం ఉంటే తప్ప బయట కు రావద్దు. ప్రతి గ్రామం లో ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉంటారు. జిల్లా యంత్రాంగానికి సహకరించాలి. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దు. అత్యవసరం ఉంటే కంట్రోల్ రూమ్ కు కాల్ చేయాలని కలెక్టర్ ప్రియాంక తెలిపారు.


ఎస్పీ వినీత్.జి మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. గోదావరికీ రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉందన్నారు.2 ఎన్ డి ఆర్ ఎఫ్ టీం లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒకటి దుమ్ముగూడెం ఉంది, చర్ల లో 40 కుటుంబాలను రెస్క్యూ చేసి, పునరావాస కేంద్రం లో ఉంచామన్నారు. మరి కొన్ని గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. పోలీస్యంత్రాంగం నిరంతరం రెస్క్యూ కు అందుబాటులో ఉంటుందన్నారు

Related posts

జీ-ట్వంటీలో మనమేంటి?

Satyam NEWS

ఘనంగా కోడి రామ్మూర్తి నాయుడు జయంతి వేడుకలు

Satyam NEWS

వార్నింగ్: నేను కంటి సైగ చేస్తే చాలు…

Satyam NEWS

Leave a Comment