Slider హైదరాబాద్

రెడ్ జోన్ ఎత్తేసినా జాగ్రత్తలు తప్పని సరి

#MLAKaleruVenkatesh

కరోనా వైరస్ కు సంబంధించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శుక్రవారం బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని సిఈ కాలనీ లో రెడ్ జోను ఎత్తివేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిబంధనలు పాటించాలని కోరారు.

రెడ్ జోను ఎత్తివేసినంత మాత్రాన కరోనా వైరస్ అంతరించినట్లు కాదని, సామాజిక దూరం పాటిస్తూ అన్నిజాగ్రత్తలూ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్, కనివేట నర్సింగ్ రావు ప్రసాద్ పలువురు నేతలు పాల్గొన్నారు.

Related posts

భారత్ లో కొత్త కరోనా వేరియంట్.. ఇండోర్ లో AY4

Sub Editor

వేత‌నాలు చెల్లించాల‌ని ap24x7 ఉద్యోగుల ఆందోళ‌న‌

Sub Editor

పబ్లిక్ పాలసీ సలహాదారుగా భాద్యత స్వీకరించిన కేఆర్ మూర్తి

Satyam NEWS

Leave a Comment