37.2 C
Hyderabad
April 30, 2024 11: 14 AM
Slider నల్గొండ

నిర్విఘ్నంగా యాదాద్రి అర్చకుడి అన్నప్రసాద వితరణ

#YadadriTemple

ప్రధాన పుణ్య క్షేత్రమైన యాదాద్రి ముఖ్య అర్చకులు కొడకండ్ల మాధవాచార్యులు నిరుపేదలకు ఆకలి తీర్చే మహాకార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని తన శక్తి మేరకు ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మాధవాచార్యులు లాక్ డౌన్  ప్రారంభం అయిన నాటి నుంచి రోజు విడిచి రోజు సుమారు 200 మందికి ఆకలితీరుస్తున్నారు.

ఎవరి నుంచి చందాలు తీసుకోకుండా తనకు ఉన్నదాంట్లో నుంచి సాధ్యమైనంత మంది ఆకలి తీర్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దేవస్థానంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల నుంచి రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసులు, వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు కూడా మాధవాచార్యులు అందిస్తున్న ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇంట్లోనే శుచిగా, సుభ్రంగా చేసిన ఆహారాన్ని ప్యాక్ చేసి అందరికి అందచేస్తున్నారు. ఆకలి బాధ తెలిసిన వాడిగా తన వంతు సాయం అందిస్తున్నట్లు ఆయన సత్యం న్యూస్ కు తెలిపారు.

Related posts

ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ రాజయ్య

Satyam NEWS

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి

Satyam NEWS

కొల్లాపూర్ ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Satyam NEWS

Leave a Comment