28.7 C
Hyderabad
April 26, 2024 09: 01 AM
Slider ఖమ్మం

పాత వస్తువుల బహిరంగ వేలం

#khammampolice

ఖమ్మం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నవంబర్ 17వ తేదీన పలు రకాల పాత వస్తువుల బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కార్యాలయం అధికారులు తెలిపారు. పోలీస్ శాఖలోని కమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన పాత వస్తువులు స్టాఫ్ కేటాయింపు బోర్డు, కంప్యూటర్ టేబుల్, డాట్ ఆపరేటింగ్ టేబుల్ఎల్ మౌంటు ర్యాక్‌తో సిస్టమ్, కుర్చీ స్టీల్ ట్యూబ్లర్, కుర్చీలు ప్లాస్టిక్, రికార్డ్ బాక్స్ (కిట్ బాక్స్) కంప్యూటర్ కుర్చీలు, అన్ని రకాల బెంచీలు,చెక్క కుర్చీలు, ష్టూల్, అన్ని రకాల స్టేబుల్స్ షాప్ టేబుల్స్, ట్రేలు, వాటర్ ప్రూఫ్ కోట్ & టోపీ మరియు బెల్ట్ ,చెక్క ఫ్రేమ్ బోర్డులు,  కాన్వాస్ బ్యాగ్స్, హ్యావర్ సాక్ బ్యాగులు, దోమతెర, టార్పాలిన్ షీట్ ,జింక్ బకెట్లు,టార్చ్ లైట్లు తదితర పాత వస్తువులను నవంబర్ 17వ తేదీ ఉదయం 10.30 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన బిడ్డర్లు, కొనుగోలుదారులు తమ ఆధార్ కార్డుతో బహిరంగ వేలంలో పాల్గొనాలని తెలిపారు. ఇతర వివరాల కోసం ఇన్స్‌పెక్టర్ కమ్యూనికేషన్స్ , ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం లో సంప్రదించాలని  సూచించారు.

Related posts

బాసరలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

Satyam NEWS

కేంద్రం ప్రవేశ పెట్టిన అద్భుతమైన పథకం ఈ శ్రమ్

Satyam NEWS

ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులతో సహా మరో మహిళ మృతి

Satyam NEWS

Leave a Comment