39.2 C
Hyderabad
May 3, 2024 12: 49 PM
Slider ముఖ్యంశాలు

తగ్గిన అడ్మిషన్స్

#Reduced admissions

ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గడం ఇంటర్‌ బోర్డులో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ తగ్గుదలకు కారణాలపై అధికారులు దృష్టిసారించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి అడ్మిషన్లు తగ్గడంతో వాటిని మళ్లీ ఏవిధంగా పెంచాలనే అంశంపై చర్చించారు. కాలేజీలు ప్రారంభమై ఇప్పటికే 40 రోజులు గడుస్తోంది. ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ కాలేజీల్లో పూర్తి స్థాయి బోధన ప్రారంభంకాలేదు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ ఇంకా మొదలే కాలేదు.

సబ్జెక్టులను బోధించడానికి ఉద్దేశించిన సుమారు 2 వేల మంది గెస్ట్‌ లెక్చరర్లను ఇంకా నియమించలేదు. కాలేజీల్లో అడ్మిషన్లను పెంచడానికి అధికారులు, కాలేజీ సిబ్బంది కూడా ఈ ఏడాది పెద్దగా ప్రయత్నం చేయలేదు. దీంతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య పడిపోయింది.

ఈ అంశంపై ఈ మధ్య రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్టు లెక్చరర్లు కూడా స్పందించారు. ఇంటర్‌ విద్య సంఘం నాయకుడు సయ్యద్‌ జజీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అడ్మిషన్లు తగ్గిపోవడానికి కాంట్రాక్టు లెక్చరర్ల ప్రయత్న లోపం కారణం కాదన్నారు. రాష్ట్రంలో వందలాది గురుకులాలు, మైనార్టీ కళాశాలలు, కస్తూర్బా కళాశాలలు, మోడల్‌ స్కూళ్లు వచ్చాయని.. వీటిలో భోజనం, హాస్టల్‌ వసతితోపాటు అన్ని సౌకర్యాలతో అడ్మిషన్లు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇలాంటి సదుపాయాలు లేవని, ఆడ పిల్లలను దూర ప్రాంతానికి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. విద్యార్థిణుల జాగ్రత్త కోసం హాస్టల్‌ ఉన్న కాలేజీలనే ఎంచుకుంటున్నారన్నారు. అడ్మిషన్ల సమయంలోనే సప్లమెంటరీ పరీక్షలు, తదనంతరం పేపర్‌ మూల్యాంకన బాధ్యతల్లో ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు 15 రోజులు పాల్గొన్నారని, ఈ సమయంలోనే కొన్ని ప్రేవేట్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో అడ్మిషన్లను నమోదు చేసుకున్నట్టు చెప్పారు.

అడ్మిషన్లు పెంచేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అడ్మిషన్లకు ఇంకా గడువున్నందున సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో హాస్టల్‌ వసతి లేదా మధ్నాహ్న భోజనం, ఉచిత బస్‌పా్‌సలాంటి సౌకర్యాలు కల్పించాలని పలు సందర్భాల్లో తాము ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ప్రభుత్వం కొన్ని మెరుగైన చర్యలు తీసుకుంటే అడ్మిషన్లు లక్ష దాటడంతోపాటు ప్రైవేట్‌ కార్పొరేట్‌ కళాశాలల మాదిరిగా అభివృద్ధి చేసి చూపుతామని ఆయన వెల్లడించారు.

Related posts

కొత్తగా జిల్లాలో కలిసిన పోలీసు స్టేషన్ లను తనిఖీ చేసిన విజయనగరం ఎస్పీ దీపిక

Satyam NEWS

ఏపీలో మరో వారం రోజులు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

Satyam NEWS

రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం: క్లీన్ చిట్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment