ఏళ్ల తరబడి పని చేస్తున్నా కూడా ఒప్పంద ఉద్యోగస్తులైన ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ, సంగీత ఉపాధ్యాయులు, పాఠశాలలో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులు, ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్నఅధ్యాపకులకు, గ్రంథాలయ ఉద్యోగస్తులకు, నర్సులకు సరైన జీతం ఇవ్వడంలేదని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగు వెంకటరమణ, గుండబాల మోహన్ అన్నారు.
15 ఏళ్లు పని చేసిన వారికి కూడా 18 వేల రూపాయలు మాత్రమే జీతం వస్తున్నదని, ఒకే పని ఓకే విద్యార్హతలు కలిగి విద్యాశాఖలోనే వేరే విభాగాలలో పని చేస్తున్న వారి జీతాలు ఎంతో ఎక్కువగా ఉన్నాయని వారన్నారు. సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవలు, తాత్కాలిక ఉద్యోగస్తులకు తక్షణమే పనికి తగ్గ వేతనం కల్పించాలని, అర్హులైన వారిని తక్షణమే ఉద్యోగాలలో శాశ్వతం చేయాలని వారు కోరారు.