29.7 C
Hyderabad
May 3, 2024 05: 47 AM
Slider ప్రకాశం

వైసీపీ అరాచకాలను బయటపెడుతున్న సొంత పార్టీ నేత

#balinenisrinivasareddy

ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలో చేశారు. వారి ప్రభుత్వంపై ఆయన ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒంగోలులో నకిలీ స్టాంపులు, రిజిస్టేషన్లతో భూ కబ్జాలకు పాల్పడుతున్న ఘటనలపై తాను కలెక్టర్‌, ఎస్పీతో మాట్లాడి సిట్ ను ఏర్పాటు చేయించానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఒంగోలులో తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలం నుంచి ఈ భూ కబ్జాలు, భూ కుంభకోణాలు జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేశారు.  తాను సిట్‌ వేయించిన తర్వాతే ప్రజలకు ధైర్యం వచ్చి తమకు జరిగిన అన్యాయంపై కంప్లైంట్ లు ఇస్తున్నారని చెప్పారు.

ఈసారి ఎన్నికల్లో గెలిచాక ఇద్దరిని మాత్రం వదిలిపెట్టనని బాలినేని తేల్చి చెప్పారు. వారి సంగతి తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ ఇద్దరూ ఎవరని అడిగితే మాత్రం ఏమీ చెప్పకుండా దాటవేశారు. తనపై కొంతమంది లేని పోని కథనాలు ప్రచారం చేస్తున్నారని.. ఏదైనా నిజం వెనుక తాను ఉంటానని బాలినేని అన్నారు. ఈ వ్యవహారంలో తాను జోక్యం చేసుకోబోనన్న బాలినేని.. భవిష్యత్తులో ఇంకెవరూ భూ కబ్జాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు.

బాలినేని చెప్పిన ఆ ఇద్దరూ దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అనే ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలోనే ఆ ఇద్దరిపై విమర్శలు చేశారు. తానేం చేసినా ఉక్రోషం పట్టలేక మాజీ ఎమ్మల్యే దామచర్ల జనార్దన్‌ అనవసర విమర్శలు చేస్తున్నారని బాలినేని అన్నారు. కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి యువత కోసం స్కీన్‌లు ఏర్పాటుచేశారని, టీడీపీ నేతలు కూడా ఒంగోలులో ఏర్పాటు చేస్తే తాము వద్దన్నామా? అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఇద్దరి అంతు మాత్రం చూస్తానని బాలినేని అన్నారు.

ప్రభుత్వంపై పరోక్షంగా బాలినేని విమర్శలు చేయడం ఇదేం కొత్త కాదు. పోలీసుల తీరుకు నిరసనగా గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు గత నెలలో రాష్ట్ర డీజీపీకి బాలినేని లేఖ రాశారు. జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో పోలీసుల వ్యవహారశైలిని తప్పుబడుతూ ఈ విధంగా వ్యవహరించారు. ఈ కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని.. ఈ కేసులో ఉన్నది అధికార పార్టీ నేతలనైనా వదిలిపెట్టవద్దని అన్నారు. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని.. నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నానని బాలినేని అన్నారు.

Related posts

‘స్పందన కు 236 వినతులు..వాటిని వేగంగా పరిష్కరించాలి’

Satyam NEWS

వీరసింహారెడ్డి ఒక విస్ఫోటనం.. చరిత్రలో నిలిచిపోతుంది

Bhavani

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కోలా ను సన్మానించిన సినీ నటుడు సుమన్

Satyam NEWS

Leave a Comment