40.2 C
Hyderabad
May 2, 2024 15: 08 PM
Slider హైదరాబాద్

నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్యంపై నారాయణకు పిహెచ్ డి

#nagarkurnool

“నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్యం – సమస్య అధ్యయనం’ అనే అంశంపై పరిశోధన చేసి వేముల నారాయణ ఉస్మానియా విశ్వవిదాయలయం నుండి పిహెచ్. డి. డిగ్రీ పొందారు. ఈ సందర్భంలో డా. శ్రీరంగాచార్య అధ్యక్షతన అభినందన సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ తెలుగు శాఖాధిపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఉస్మానియా విశ్వవిదాయలయం పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు, డీన్ ఆచార్య ఎస్వీ రామారావు హాజరయ్యారు. అలాగే ఆత్మీయ అతిథులుగా డా.లయన్ ఎస్.రామారావు, కోరుప్రోలు హరనాథ్, డా. వెలుదండ సత్యనారాయణ, డా.రాములు గౌడ్, కపిలవాయి అశోక్ బాబులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభాధ్యక్షులు డా. శ్రీరంగాచార్య మాట్లాడుతూ డా. వేముల నారాయణ నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలెం కళాశాలలో మా విద్యార్థి. ఈ కళాశాల విద్యార్థులు ఎందరో ఉన్నత చదువులు చదివి వివిధ స్థాయిలలో స్థిరపడ్డారన్నారు. ముఖ్య అతిథి ఆచార్య ఎస్వీరామారావు ప్రసంగిస్తూ… అస్తిత్వమే పునాదిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తన చరిత్రను పునర్నిర్మించుకోవాలన్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లా సాహిత్యంపై పరిశోధనలు జరగాలన్నారు.  ఆచార్య వెలుదండ నిత్యానందరావు పరిశోధన చేయడం కత్తిమీది సాము అన్నారు. ఇంత కష్టపడి చేసిన పరిశోధన గ్రంథాలను ప్రచురించాలన్నారు. ఆత్మీయ అతిథులు డా. రామన్ గౌడ్, కోరుప్రోలు హరనాథ్ లు పరిశోధకులు ఎదిగినకొద్ది ఒదిగి ఉండాలన్నారు.

ఆచార్య వెలుదండ నిత్యానందరావు సూచన మేరకు ఎస్.ఆర్.ఆర్. ఛారిటబులం ట్రస్ట్ ఫౌండర్, ఛైర్మన్ డా. లయన్ ఎస్. రామచంద్రరావు మాట్లాడుతూ మా ట్రస్ట్ తరఫున ఈ పరిశోధక గ్రంథాన్ని ముద్రిస్తామని చెప్పారు.  చివరగా పరిశోధక కర్త డా. వేముల నారాయణ తన పరిశోధన విధానం తెలియజేసి ఈ కార్యక్రమానికి వచ్చిన గురువులను తగిన రీతిలో సత్కరించారు. ఈ అభినందన కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారి బి.గోపాలంరావు, విశ్రాంత ఉపాధ్యాయులు ఆర్. అర్జునరావు, గజ్జల శ్రీనివాస్ గౌడ్, వేముల గాయత్రి, నర్సింహులు పాల్గొని డా. వేముల నారాయణను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్వీ రఘువీర్ ప్రతాప్ నిర్వహించారు.

Related posts

రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దుష్ట చతుష్టయం

Satyam NEWS

202 మందికి  రూ.2 కొట్లు విలువైన చెక్కులు పంపిణి

Satyam NEWS

గాంధీ డాక్లర్లపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

Satyam NEWS

Leave a Comment