42.2 C
Hyderabad
May 3, 2024 15: 07 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల విడుదల

#Srivari Arjitaseva tickets

తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేస్తున్నది. అక్టోబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం 19వ తేది ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

అలాగే అక్టోబరు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జూలై24వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ టికెట్లు, టోకెన్లను ‘తిరుపతి బాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే అధికారిక వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Related posts

రాష్ట్ర దడవాయి సంఘం అధ్యక్షుడు విజయ్ కు సన్మానం

Satyam NEWS

స్కూళ్లకు సెలవు

Bhavani

పైడితల్లి అమ్మవారి ని దర్శించుకున్న కేంద్రమాజీ మంత్రి

Satyam NEWS

Leave a Comment