40.2 C
Hyderabad
May 6, 2024 16: 00 PM
Slider ప్రత్యేకం

కల్వకుర్తిలో ఉగ్రవాదుల శిక్షణ కేంద్రం?

#jamateeslam

ఉమ్మడి పాలమూరు జిల్లా లోని కల్వకుర్తి పట్టణంలో హిందువులను ముస్లింలుగా మతం మార్చి ఉగ్రవాద శిక్షణకు పంపిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. విక్కీ అనే ముస్లిం వ్యక్తి హిందువులను ఏమార్చి ముస్లింలుగా మతం మారుస్తున్నాడని ఆయన తెలిపారు. తమ దగ్గర ఉపాధి కోసం పనిచేసే హిందూ యువకులకు ఇస్లాం గురించి నూరి పోస్తూ ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హిందూ యువకులు ముస్లింలుగా మారితే, ముస్లిం అమ్మాయిలను ఇచ్చి పెళ్లి కూడా చేస్తామని ప్రేమ వ్యవహారాలు కూడా వారే  నేర్పుతున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు.

కల్వకుర్తి పట్టణానికి చెందిన శివ రామాచారి అనే యువకుడిని మతం మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, నిజామాబాద్ తదితర నగరాలలో ఉగ్రవాద శిక్షణకు పంపుతున్నట్లు తెలుస్తోందని బాలాస్వామి తెలిపారు. ఇదే విషయమై శివ రామాచారి తండ్రి భాస్కరాచారి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాడు. వెంటనే తన కొడుకుని తీసుకువచ్చి తనకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. తన కొడుకును ముస్లిం మతంలోకి బలవంతంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని.. ఇస్లాంలోకి మారాక ఉగ్రవాదంలోకి పంపుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడని ఆయన అన్నారు.

విక్కీ అనే ముస్లిం వ్యాపారి దగ్గర ఇంకా కొంతమంది హిందూ యువకులు ఉన్నారని.. వారందరిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ఈ సంఘటన విషయమై.. విశ్వహిందూ పరిషత్ నేతలు కల్వకుర్తి పోలీస్ అధికారులను సంప్రదించగా.. పూర్తి వివరాలు సేకరిస్తామని సమాధానం చెప్పారని బాలాస్వామి తెలిపారు.

Related posts

అమరావతిలో పదివేల మంది రైతుల మహాపాదయాత్ర

Satyam NEWS

ఇండోనేషియాలో భూకంపం: 162 మంది మృతి

Satyam NEWS

మరో సారి జంటగా వస్తున్న కాజల్, రానా

Satyam NEWS

Leave a Comment