28.7 C
Hyderabad
May 6, 2024 01: 35 AM
Slider ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పదివేల మంది రైతుల మహాపాదయాత్ర

mahadharna

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు నేడు మహాపాదయాత్ర చేస్తున్నారు. తుళ్లూరు నుంచి మందడం వరకూ ఈ పాదయాత్ర సాగుతుంది. సుమారు పది వేల మంది రైతులు ఈ మహా పాదయాత్రలో పాల్గొన్నారు.

రాజధానిలో జరుగుతున్న ధర్నా లు ర్యాలీ లకి ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు అడిషనల్ ఎస్పీ చక్రవర్తి అన్నారు. ఈరోజు తుళ్ళూరు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తో  కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రాజధానిలో పోలీసులపై జరుగుతున్న దుష్ప్రచారం నమ్మవద్దు అని అన్నారు.

రాజధాని లో పోలీసులకు సహాయ నిరాకరణ అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు అన్నారు. పోలీసులు విధి నిర్వహణ లో ఎవ్వరి పైన ఆధారపడి ఉండటంలేదు సిబ్బందికి కావలసిన అన్ని సదుపాయాలు డిపార్ట్మెంట్ కల్పిస్తుందని అన్నారు. మందడంలో మహిళల పై దాడి జరిగింది అంటూ ప్రచారం జరిగింది.

కానీ ఆరోజు మాహిళా రైతులు పోలీసుల పై దాడి చేశారు ఆ దాడిలో ఇద్దరు మహిళా పోలీస్ లకు గాయాలయ్యాయి అని అన్నారు. రైతులపై అక్రమ కేసులు పెట్టారంటూ వస్తున్న  వార్తల్లో నిజం లేదు. ఉద్దండ్రాయనిపాలెం లో మీడియా పై జరిగిన దాడి లో ఉన్న వ్యక్తుల పై మాత్రమే కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేసాం అని చెప్పారు.

Related posts

క్రీడలు జీవితాంతం ఆరోగ్యాన్ని ఇస్తాయి

Bhavani

పోషణ అభియాన్ లో పోషకాహార విలువలపై అవగాహన

Satyam NEWS

చురుకుగా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులు

Satyam NEWS

Leave a Comment