రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ (19) దోపిడీ కేసులో 6 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
ఇటీవల టైఫాయిడ్, రక్తపు వాంతులు కావడంతో చికిత్స పొందుతూ, డెంగ్యూ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఈ నెల 19 అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్ చేర్చారు. ఈ మేరకు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.