40.2 C
Hyderabad
May 2, 2024 16: 45 PM
Slider సంపాదకీయం

కొత్త మంత్రుల పేర్లు దాదాపు ఖరారు: ఇదే లిస్టు

roja-1

పాత మంత్రులంతా పోయారు… ఇక కొత్త మంత్రులు రాబోతున్నారు. మంత్రులంతా రాజీనామా పత్రాలు సమర్పించినందున కొత్తగా మరెవరు మంత్రులు కాబోతున్నారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఈ దశలో దాదాపుగా ఖరారైన పేర్లు వెలుగులోకి వచ్చాయి. మొదటి నుంచి జగన్ కు సన్నిహితురాలిగా ఉంటూ, పార్టీ తరఫున టిడిపిని ఎదుర్కొంటూ వస్తున్న నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కు మంత్రి పదవి దక్కబోతున్నట్టు సమాచారం.

వైసీపీ కీలక నాయకులు వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త మంత్రివర్గం ఈ విధంగా ఉండబోతోంది. ప్రస్తుత క్యాబినెట్ లో మంత్రులు గా ఉన్న ఆదిమూలపు సురేష్, సిదిరి అప్పలరాజు, వేణు గోపాల కృష్ణ, గుమ్మనూరు జయరాం, శంకర్ నారాయణ కొనసాగుతారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రిగా సిదిరి అప్పల రాజు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావుకు  అవకాశం దక్కబోతోంది. విజయనగరం నుంచి సీనియర్ ఎమ్మెల్యే రాజన్న దొర, కొల్లి భాగ్య లక్ష్మి కి అవకాశం కల్పించబోతున్నారు.

విశాఖ జిల్లా నుంచి బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్ కు అవకాశం దక్కబోతోంది. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తో పాటు,  ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ కొనసాగనున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ , తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కి ఛాన్స్ దగ్గబోతోంది.

కృష్ణా జిల్లా నుంచి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, ఎన్టీఆర్ జిల్లా నుంచి మొండితోక జగన్మోహనరావు కు ఛాన్స్ ఉండబోతోంది. ఇక గుంటూరు జిల్లా నుంచి సిటీ ఎమ్మెల్యే ముస్తఫా, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని, వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున కు అవకాశం ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ప్రస్తుత మంత్రి ఆదిమూలపు సురేష్ కొనసాగుతుండగా నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి తో పాటు,  సంజీవయ్యకు అవకాశం దక్కబోతోంది.

చిత్తూరు జిల్లా నుంచి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ కు ఛాన్స్ ఉంది. కర్నూలు జిల్లాలో ప్రస్తుత మంత్రి గుమ్మనూరు జయరాం కొనసాగబోతూ ఉండగా, కొత్తగా శిల్పా చక్రపాణి రెడ్డి, సుధాకర్ కు అవకాశం దక్కబోతోంది. అనంతపురం జిల్లా నుంచి ప్రస్తుత మంత్రి శంకర్ నారాయణ కొనసాగబోతున్నారు. కొత్తగా అనంత వెంకట్రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి కి ఛాన్స్ దక్కబోతోంది అలాగే కడప జిల్లా నుంచి రైల్వేకోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ కు జగన్ ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Related posts

ప్రయివేటు స్కూళ్ల వారికి ప్రభుత్వ సాయం షురూ

Satyam NEWS

గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వానికి విశేష స్పందన

Satyam NEWS

సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం: ఈటల రాజేందర్

Satyam NEWS

Leave a Comment