గత నెల 27వ తేదీన దిశపై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే. అదే ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా ఎన్ కౌంటర్ జరిగింది. నేటి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
జైల్లో ఉన్నప్పుడు నిందితులను వేరువేరుగా ఉంచారు. నిందితులను ఘటనకు పాల్పడిన ప్రాంతానికి తీసుకురాగానే అరగంటపాటు విచారణ జరిగిన అనంతరం ఆరిఫ్ మొదట పోలీసులపై దాడి చేశాడు. అనంతరం మిగతా ముగ్గురు పోలీసులపై తిరగబడ్డారు.
నిందితులు పోలీసుల వద్ద నున్న తుపాకులు లాక్కొని పారిపోతుండగా కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. సంఘటన స్థలంలోనే నాలుగురూ మరణించారు.